Crime News: హోలీ ఆడడానికి వెళ్లి శవంగా మారిన యువకుడు..
మేడ్చల్ జిల్లా దుండిగల్ లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.
హోలీ ఆడడానికి వెళ్లిన యువకుడు శవమై కనిపించిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక రాజీవ్ గృహకల్పలో వినయ్ అనే యువకుడు తల్లి పాటు నివాసిస్తున్నాడు. ఈ నెల 8న హోలీ అడడానికి వెళ్లాడు. సాయంత్రం గాయాలతో ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికే అతని నలుగురు స్నేహితులు వచ్చి వినయ్ రాలేను అంటుండగానే బలవంతంగా తీసుకెళ్లినట్లు మృతుడి తల్లి చెప్పింది.
అతను ఆ రోజు ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి వెతకడం మొదలు పెట్టారు. ఇంతలో జ్యోతి మిల్క్ పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో వినయ్ విగతజీవిగా పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు విచారణ ప్రారంభించారు.

వినయ్ గతంలో బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీస్ రికార్డులో ఉందని ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications