Crime: అతడికి 20.. ఆమెకు 28.. ఇద్దరు పిల్లలు కూడా.. ఏం జరిగిందంటే..!
ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. గుడిహత్నూర్ మండలంలోని సీతాగోంది శివారులో రెండు మృతదేహాలు కనిపించడం స్థానికంగా సంచలనం రేపింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలపడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, సీఐ నైలు, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం సిబ్బంది డాగ్‌స్కాడ్‌తో ఘటనాస్థలాన్ని జల్లెడ పట్టారు.
మృతులను ఆదిలాబాద్ పట్టణం భుక్తాపూర్‌కు చెందిన రెహమాన్, కేఆర్‌కే నగర్‌కు చెందిన అశ్వినిగా గుర్తించారు. అశ్విని కొన్ని నెలల క్రితం భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అశ్వినికి తన కన్నా 8 ఏళ్ల చిన్న అయిన రెహమాన్‌తో వివాహేతర సంబంధం ఉండడం వల్లే ఈ హత్యలు జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అశ్విని, రెహమాన్ శుక్రవారం ఆదిలాబాద్ నుంచి సీతాగోందిలోని పంట పొలంలోకి ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. అశ్విని, రెహమాన్ కాల్ లిస్ట్.. అశ్విని భర్త కాల్ లిస్ట్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అశ్విని, రెహమాన్ తలలపై బండరాళ్లతో మోది కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
ఈ హత్యలు అశ్విని భర్త తరఫు వాళ్లే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ నాగేందర్ చెప్పారు. వివాహేతర సంబంధం వల్ల అనేక ప్రాణాలు పోతున్నాయనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.












Click it and Unblock the Notifications