Durgam Chinnaiah: దుర్గం చిన్నయ్య ఓ కామపిశాచి.. శేజల్ సంచలన ఆరోపణలు..!
దుర్గం చిన్నయ్యకు సీఎం కేసీఆర్ మరోసారి టికెట్ ఇవ్వడంపై బాధితురాలు శేజల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 7 నెలలుగా దుర్గం చిన్నయ్యపై పోరాటం చేస్తున్నట్లు శేజల్ చెప్పారు. దుర్గం చిన్నయ్య కామపిశాచి అని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఆడపిల్లలను లైంగికంగా వేధించినట్లు చెప్పారు. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని తిరగని పోలీస్ స్టేషన్ లేదని అన్నారు. కామాపిచాచి, చీటర్ అయిన వ్యక్తి టికెట్ ఎలా ఇస్తారంటూ శేజల్ ప్రశ్నించారు. ఇదే ఎమ్మెల్యే మరో అమ్మాయిని వేధించడ గ్యారెంటీ ఇస్తారా అని అడిగారు.
తనకు న్యాయం జరగకుండా దుర్గం చిన్నయ్యకు టికెట్ ఎలా ఇస్తారని శేజల్ ప్రశ్నించారు. బెల్లింపల్లిలో దుర్గం చిన్నయ్య ఎలా గెలుస్తారో చూస్తానని శేజల్ సవాల్ విసిరారు. బెల్లంపల్లిలో ఇంటింటికి తిరిగి దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా గడపగడపకు తిరిగి ప్రచారం చేస్తానని తెలిపారు. డెయిరీ ఏర్పాటు చేయడానికి మొదటిసారిగా దుర్గం చిన్నయ్య వద్దకు వెళ్లామని శేజల్ గతంలో చెప్పారు. డెయిరీ ఏర్పాటు చేసుకోండి కానీ.. తమకు తెలిసిన వారికి వాటా ఇవ్వాలని కోరినట్లు వివరించింది. అలా చేస్తే తన మద్దతుతోపాటు ఏం కావాలన్న చేస్తామని ఎమ్మెల్యే చెప్పినట్లు శేజల్ తెలిపారు.

ఎమ్మెల్యే ప్రతిపాదన ఒకే చెప్పి వారికి సంబంధించిన వారికి వాటా ఇచ్చామని పేర్కొన్నారు. రెండెకరాల భూమి కూడా ఇచ్చారని, బిజినెస్ గురించి చిన్నయ్యను కలవడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వెళ్లేవాళ్లమని గతంలో మీడియాకు వివరించారు. ఈ క్రమంలో తమతో పాటు తమ కంపెనీలో పని చేసే అమ్మాయిని తీసుకెళ్లామని. ఆమెను చూసిన ఎమ్మెల్యే తన వద్ద పంపాలని కోరినట్లు శేజల్ ఆరోపించారు.దానికి తాము ఒప్పుకోలేదని.. ఒత్తిడి పెరగడంతో చేసేది ఏమి లేక బ్రోకర్ నెంబర్లు తెలుసుకుని ఆయనకు పంపించామని శేజల్ వివరించారు.
వాళ్లతో ఆయన టచ్ లో ఉన్నట్లు పేర్కొంది. తనతో బలవంతంగా మద్యం తాగించాలని చూశాడని ఆరోపించిన శేజల్ ఆ తర్వాత తమను అరెస్ట్ చేయించాడని చెప్పింది. తనకు న్యాయం చేయాలని శేజల్ రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. ఢిల్లీలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేయగా.. జూబ్లీహిల్స్ పెద్దమ్ తల్లి గుడి సమీపంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.












Click it and Unblock the Notifications