తల్లిదండ్రుల మాట వినలేదు, భార్య మంచిది: సూసైడ్ నోట్‌లో యువకుడు

కరీంనగర్: జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగుల శ్రీనివాస్‌ (27) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరు నెలల క్రితమే అతని సోదరుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం, ఇప్పుడు అతని తమ్ముడు శ్రీనివాస్ ప్రాణాలుతీసుకోవడం వీరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిపేటకు చెందిన నాగుల పర్శరాములు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు. కాగా, చిన్న కొడుకు శ్రీనివాస్‌కు ఎనిమిది నెలల క్రితమే గంభీరావుపేటకు చెందిన లతతో వివాహం జరిగింది.

శ్రీనివాస్‌ ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తూనే తండ్రికి సాయపడుతున్నాడు. శ్రీనివాస్‌ బుధవారం ఉదయమే భార్య లత, తల్లి విజయలను పొలం వద్ద దింపి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం ఇంటి తలుపులు బిగించుకుని స్లాబుకు ఉరరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

A youth allegedly committed suicide in Karimnagar

పొలం వద్ద పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు తలుపులు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి వెనుకవైపు నుంచి డోర్లు బద్దలు కొట్టుకునిలోనికి ప్రవేశించారు. అప్పటికే శ్రీని వాస్‌ మృతి చెందాడు. మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పెళ్లైన 8నెలలకే ఈ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఎవరూ కారణం కాదు

కాగా, శ్రీనివాస్ తన ఆత్మహత్య లేఖలో పలు విషయాలను వెల్లడించాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని శ్రీనివాస్ పేర్కొన్నాడు. తాను తన తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదని, తన క్షమించాలని కోరాడు. తన భార్య లత కూడా చాలా మంచిదని, తన తొందరపాటు నిర్ణయానికి క్షమించాలని లేఖలో పేర్కొన్నాడు.

ఆర్థిక ఇబ్బందులే కారణమా?

అయితే, ఆర్థిక ఇబ్బందులతో కారణంగానే శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వ్యవసాయం, గీత కార్మిక వృత్తిలో కొనసాగుతూనే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్.. నిజామాబాద్‌లో హోటల్‌ పెట్టేందుకు సుమారు రూ.2లక్షల వరకు అప్పు చేశాడు.

కాగా, ఆ డబ్బును ఇంటి ఖర్చులకు వినియోగించాడు. అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో మనస్థాపం చెందిన శ్రీనివాస్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య సమాచారం.

అన్న కూడా ఇదే తరహాలో..

నాగుల పర్శరాములు పెద్ద కొడుకు శ్రీకాంత్ కూడా ఆరు నెలల క్రితం ఇదే రీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లైన 19రోజులకే శ్రీకాంత్‌ తనువు చాలించాడు. ఈ ఘటన నుంచి తేరుకోకమేందే శ్రీనివాస్‌ కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో కన్నవారు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఆరునెలల వ్యవధిలో అన్నదమ్ములిద్దరూ క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడంతో మేమేం పాపం చేశామంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నెలల వ్యవధిలోనే సోదరులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం ఆ గ్రామంలో విషాదం నెలకొంది. శ్రీనివాస్‌ రాసిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉపేందర్‌ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+