లెక్చరర్‌ను ప్రేమించాడు, కవితలు రాశాడు: చివరకు ప్రాణాలే వదిలేశాడు

Subscribe to Oneindia Telugu

ఖమ్మ: ఓ అధ్యాపకురాలిలో ఓ యువకుడు నడిపిన ప్రేమాయణం చివరకు విషాదాంతమైంది. ఖమ్మం జిల్లా బోనకల్‌ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యువ‌కుడి మృతదేహాన్ని గ‌మ‌నించిన రైల్వే పోలీసులు అక్క‌డ ల‌భించిన ఆత్మ‌హ‌త్య లేఖ ఆధారంగా కేసు న‌మోదుచేసున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోర్ల వెంకటసాయి (18) ఖమ్మంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అత‌డు గ‌తంలో చదివిన కాలేజీలో ఓ అధ్యాపకురాలితో సన్నిహితంగా ఉండేవాడ‌ు. ఆమెపై క‌విత‌లు కూడా రాశాడని చెప్పారు.

A youth allegedly committed suicide for lover

అయితే, మూడు రోజుల క్రితం ఆ అధ్యాపకురాలి కుటుంబ సభ్యులు సాయిని పిలిచి నిర్భందించారని పోలీసులు తెలిపారు. అత‌డిని హెచ్చ‌రించి పంపేశార‌ని చెప్పారు. కాగా, త‌న కొడుకు వ్య‌వ‌హారాన్ని తెలుసుకున్న సాయి తండ్రి, అత‌డిని కృష్ణాజిల్లా రోళ్లపాడు గ్రామంలో ఆ యువ‌కుడి మేనమామ ఇంట్లో ఉంచాడ‌ని పోలీసులు అన్నారు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సాయి అక్క‌డి నుంచి బోనకల్‌కు వ‌చ్చేశాడ‌ని, రైల్వేస్టేషన్ సమీపంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని చెప్పారు. ఆ అధ్యాపకురాలి కుటుంబ సభ్యులు త‌న కుమారుడిని వేధించార‌ని ఆరోపించారు. త‌మ కుమారుడు రాసిన ఆత్మ‌హ‌త్య లేఖ‌లో అధ్యాపకురాలితో త‌న‌ ప్రేమ, పరిచయాలను రాశాడని ఆయ‌న చెప్పారు. చివ‌రికి త‌న కుమారుడిపై సైకో అనే ముద్రవేశార‌ని ఆయన వాపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A youth allegedly committed suicide for his lover in Khammam district.
Please Wait while comments are loading...