మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు: కొడుకును చంపిన తండ్రి

మెదక్: జిల్లాలోని అల్లదుర్గ మండలం ఐబీ తండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగుడికి బానిసైన ఓ కొడుకు మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తన తల్లిని కొట్టి చంపాడు. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన తులసీ బాయి కొడుకు నరేష్ మద్యానికి బానియ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం డబ్బులు ఇవ్వాలని తులసీబాయిని అడిగాడు.

డబ్బులు ఇవ్వడానికి ఆమె నిరాకరించడంతో రోకలి బండతో ఆమె తలపై మోదాడు. దీంతో తులసీబాయి అక్కడికక్కడే మృతి చెందింది. తండా వాసుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నరేశ్ పరారీలో ఉన్నాడు.

కొడుకును చంపిన తండ్రి

మెదక్ జిల్లాలోని పుల్‌కల్ మండలం సుల్తాన్‌పూర్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి బాబయ్య తన కొడుకు రాజును హత్య చేశాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

A youth allegedly mudered his mother

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని విద్యానగర్‌లో విషాద ఘటన చోట చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. విద్యానగర్‌కు చెందిన కమటం శ్రీనివాస్‌కి అదే మండలంలోని జాప్తాపురం గ్రామానికి చెందిన సుధారాణితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

కాగా, శ్రీనివాస్ ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. సుధారాణి స్థానిక ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయినిగా పని చేస్తూ అత్తామామలతో ఉంటోంది. కొన్ని రోజుల నుంచి కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంతో గ్రామస్తులు ఆమె అత్తామామలపై స్థానికులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సుధారాణి అత్తామామలను స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+