వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నానం చేస్తున్న మహిళను వీడియో తీశాడు: వ్యక్తిపై నిర్భయ కేసు

స్నానం చేస్తున్న ఓ మహిళను వీడియో చిత్రీకరించిన వ్యక్తిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఓయూ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్నానం చేస్తున్న ఓ మహిళను వీడియో చిత్రీకరించిన వ్యక్తిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఓయూ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాలకు చెందిన వెంకటేశ్‌ (23) మాణికేశ్వర్‌నగర్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.

మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్న అతడు చదువుపై దృష్టి పెట్టకుండా.. గురువారం పక్కింటి మహిళ స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. గమనించిన ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

A youth allegedly shoot video of a bathing woman, in Secunderabad.

నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

నలుగురిపై ఎస్సీ, ఎస్టీఅట్రాసిటీ కేసు నమోదైన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్ కుమార్ కథనం ప్రకారం.. వెంకట సుబ్బమ్మ(60) దమ్మాయిగూడ సీఎస్ రావునగర్ కాలనీలో నివాసముంటుంది. జనవరి 17న ఇంటికి పెయింటింగ్ వేస్తున్న క్రమంలో పక్కనే ఉన్న స్వర్ణలత ఇంటిపై పెయింటింగ్ మరకలు పడ్డాయి.

స్వర్ణలత ఇంటిపై పడిన పెయింటింగ్ మరకలను తొలగిస్తానని వెంకట సుబ్బమ్మ చెప్పినప్పటికీ వినకుండా కులం పేరుతో దూషించింది స్వర్ణలత. అంతలోనే స్వర్ణలత కుమారుడు నవీన్‌రాజ్, కోడలు గాయత్రి, అల్లుడు రతీష్‌లు వెంకట సుబ్బమ్మను కులం పేరుతో దూషించడమే కాకుండా తీవ్రంగా గాయపర్చారు.

కుటుంబ సభ్యులు వెంకట సబ్బమ్మను స్థానికులు మిలటరీ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. గురువారం బాధితురాలి ఫిర్యాదు మేరకు స్వర్ణలత, నవీన్‌రాజ్, గాయత్రి, రతీష్‌లపై ఐపీసీ 448,324,506, సెక్షన్ 3(1)ఆర్,ఎస్, 3(2) వీఏ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A youth allegedly shoot video of a bathing woman, in Secunderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X