రేవంత్ వ్యక్తిగత సిబ్బందికీ ఏసీబీ నోటీస్: ఎవరీ జిమ్మి? లోకేష్‌తో..(పిక్చర్స్)
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. రేవంత్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు జారీ చేసింది. వారి వాంగ్మూలాలను నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేశారు. వారిని సాక్షులుగా చేర్చనున్నారని తెలుస్తోంది. నలుగురికి నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే ఏసీబీ సండ్ర వెంకట వీరయ్యకు ఆదివారం నాడు మరోసారి నోటీసులు ఇచ్చింది. అలాగే, సెబాస్టియన్ స్నేహితుడైన జిమ్మీకి ఇచ్చింది. సండ్ర ఈ నెల 6న బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5లోగా విచారణ నిమిత్తం హాజరు కావాలని అదనపు ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసుకు సంబంధించి తెలిసిన విషయాలు, ఆ కేసుతో ఉన్న సంబంధాల వివరాలను తెలియజేయాలని కోరింది. ఈ తాఖీదులను సండ్ర నివాసానికి చెందిన గోడకు అతికించారు. ఓటుకు నోటు కేసు నిందితులతో సండ్రకు ఉన్న సంబంధాలపై విచారించడానికి సిద్ధమయ్యారు.
సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఎ) కింద తాఖీదులు జారీ అయినపుడు తగిన కారణాలున్నట్లయితే అరెస్ట్ చేయడానికి అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. తాఖీదులు జారీ అయిన నేపథ్యంలో ఏసీబీ నిర్దేశించిన గడువులోగా హాజరవుతానని, వారికి విచారణకు సహకరిస్తానని సండ్ర చెప్పారు.

జిమ్మీ బాబు మిత్ర మండలి
స్టీపెన్ సన్ వాంగ్మూలంలో జిమ్మీ అనే వ్యక్తి వచ్చి తనను సెబాస్టియన్ వచ్చి కలుస్తాడని చెప్పిన అంశంపై ఏసీబీ విచారణకు నిర్ణయించింది.

టీడీపీ నేతలతో జిమ్మీ
ఈ నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో రెండు నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ స్నేహితుడైన జిమ్మీకి కూడా ఏసీబీ తాఖీదులు జారీ చేసిందని తెలుస్తోంది.

టీడీపీ నేతలతో జిమ్మీ
ఫిర్యాదుదారు అయిన ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను సెబాస్టియన్‌ను, మత్తయ్య జెరూసలేంను పరిచయం చేసింది జిమ్మీయేనని ఏసీబీ దర్యాప్తులో తేలిందని సమాచారం

టీడీపీ నేతలతో జిమ్మీ
ఈ నేపథ్యంలో జిమ్మీని విచారించి ఏ నేపథ్యంలో పరిచయం చేసింది, కేసుకు సంబంధించి ఇతర వివరాలేమైనా ఉన్నాయా అన్న అంశాలపై ఆరా తీయనున్నారు.












Click it and Unblock the Notifications