సండ్రకు మళ్లీ నోటీసు: ఇంటి గోడకు అతికించిన ఏసిబి
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరికొంత సమాచారం సేకరించేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు శనివారం ఏసిబి అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి(సోమవారం) సాయంత్రం 5గంటల లోపు హాజరు కావాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లిన ఏసిబి అధికారులు, సండ్ర వెంకటవీరయ్య ఇంటి వద్ద లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఇటీవల ఎమ్మెల్యే సండ్ర ఏసిబికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

తాను ఏసిబి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని ఆ లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఏసిబి అధికారులు సండ్రకు నోటీసులు జారీ చేశారు. అంతకుముందు తనకు అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోతున్నానని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, తాను ఖమ్మంలోని తన ఇంట్లో ఉన్నానని ఎమ్మెల్య సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఏసిబి ఇచ్చిన గడువులోగా హాజరవుతానని వెల్లడించారు.












Click it and Unblock the Notifications