గాంధీలో రేవంత్: బెయిల్ రద్దు చేయలంటూ హైకోర్టులో పిటిషన్ (ఫోటోలు)
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. నెల రోజులు జైలు జీవితం గడిపిన రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడం, ఇటీవలే బెయిల్ షరతులను సడలించిన నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆ పిటిషన్ లో ఏసీబీ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది.

రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయలంటూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్
ఈ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఓటుకు నోటు కేసులో కీలక సాక్ష్యులు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఏసీబీ తన పిటిషన్‌లో పేర్కొంది. హైదరాబాద్‌లోకి అడుగుపెట్టిన వెంటనే ఎల్బీ నగర్ వద్ద సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ ‘‘ఆట కాదు... వేట మొదలైంది'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే

రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయలంటూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్
ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఎక్కడ సభల్లో ప్రసంగించినా పరుష పదజాలాన్ని వాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంజూరు చేసిన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలని ఏసీబీ హైకోర్టును ఆశ్రయించింది.

గాంధీలో రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ వర్గీయలు చేసిన దాడిలో గాయపడి, హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త చందూలాల్ ను బుధవారం టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలోని టీడీపీ నేతలను టీఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు.

గాంధీలో రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ పార్టీలో చేరని టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. చందూలాల్ పై దాడికి దిగిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చందూలాల్ కుటుంబాన్ని టీడీపీ ఆదుకుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications