కోట్లకు పడగలెత్తాడు: జీహెచ్ఎంసీ ఏసీపీ ఇంట్లో ఏసీబీ దాడులు

హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఇళ్లపై శుక్రవారం ఉదయం నుంచి అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) దాడులు నిర్వహిస్తోంది. ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌10లో పట్టణ ప్రణాళిక విభాగం ఉప అధికారి(ఏసీపీ)గా సంతోష్‌ వేణు పనిచేస్తున్నారు.

నారాయణగూడలోని అతని నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సోదాల్లో ఇప్పటి వరకూ రూ.కోటికి పైగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.

ACB Raids GHMC ACP Santosh Venu House

నారాయణగూడతోపాటు గుడిమల్కాపూర్, డీడీ కాలనీ, అల్వాల్‌లో గల నివాసాలపై ఏకకాలంలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

గతంలో శేరిలింగంపల్లి ప్రాంతంలో పట్టణ ఉప ప్రణాళికాధికారిగా పనిచేసిన సమయంలోనూ సంతోష్‌ వేణుపై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన బీపీఎస్‌ పథకాన్ని అవకాశంగా మలుచుకుని అక్రమాలకు పాల్పడినట్లు జీహెచ్‌ఎంసీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+