అక్రమాస్తులు 150 కోట్లకుపైమాటే.. మీరు ఏం చేశారు సారూ!
అవినీతి నిరోధక శాఖ(ACB)కి మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ నివాసంలో శనివారం ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి అధికారులు సోదాలు చేస్తున్నారు. నిఖేష్ బంధువులతోపాటు సన్నిహితుల ఇళ్లలో కలిపి మొత్తం 30 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు తెలిసింది.
కాగా, ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఫాంహౌస్‌లతోపాటు భారీగా వ్యవసాయ భూములు, ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్లు, భవనాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కిలోల కొద్దీ బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏఈఈ ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం.. దాదాపు 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

మూడు ఫాంహౌజ్‌ల విలువే రూ.80 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
అయితే, నిఖేశ్ కుమార్ గతంలో కూడా లంచం తీసుకుని సస్పెన్షన్‌కు గురికావడం గమనార్హం. ఓ దరఖాస్తు దారుడిని ఏఈఈ నిఖేశ్ కుమార్ రూ. 2.50 లక్షలు లంచం అడిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయంలో 6 నెలల క్రితం ఏసీబీ సోదాలు జరిగాయి. లంచం తీసుకుంటూ ఈఈ బన్సీలాల్, ఏఈ నిఖేశ్ కుమార్ కార్తీక్ ఏసీబీకి చిక్కారు. ప్రస్తుతం నిఖేశ్ సస్పెన్షన్‌లోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications