కేటీఆర్ కు నోటీసులు.. కవిత కీలక కామెంట్స్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు మరోసారి నోటీసులు అందాయి. ఫార్ములా- ఈ కేసులో భాగంగా విచారణకు జూన్ 16న హాజరు కావాలని ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూన్ 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు.
అయితే ఏసీబీ ఇచ్చిన నోటీసులపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. జూన్ 16న విచారణకు వస్తున్నట్లు తెలిపారు. బాధ్యతగల పౌరుడిగా ఏసీబీ అధికారుల ముందు హాజరవుతానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఏసీబీ విచారిస్తోందని ఎద్దేవా చేశారు. ఇద్దరం లై డిటెక్టర్ టెస్టుకు వెళ్దామా..? అని సవాల్ విసిరారు.

అయితే కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని ఆమె ఖండించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజా క్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని అన్నారు.
When you cannot run a government, keep people busy with a circus and distractions! Congress and its clown CM’s antics won’t deter us
— KTR (@KTRBRS) June 13, 2025
I have been summoned by the Anti-Corruption Bureau to appear for ‘investigation’ on Monday at 10am, in Formula-E case where ₹ 44 crore was…
మరోవైపు జూన్ 11న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు అయ్యారు. కమిషన్ సంధించిన 18 ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. దాదాపు గంట పాటు ఆయనను విచారించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. జూన్ 11న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విచారణ ప్రారంభం అయింది. ఆ సమయంలోనే కేసీఆర్ స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన విజ్ఞప్తి మేరకు ఇన్ కెమెరా విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్ అంగీకరించింది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications