మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హైదరాబాదీల మృతి
నాందేడ్/హైదరాబాద్: మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
సోమవారం మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో దెగ్లూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీమన్నారాయణ(60), కల్యాణి(55), స్రవంతి(28)లు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు.

కారులోని మోహన్‌కృష్ణ, శ్రీకృష్ణనారాయణ, లసియాలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు నాందేడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులందరూ హైదరాబాద్ మదీనాగూడలోని ఒకే కుటుంబానికి చెందినవారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
ఈతచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి
వరంగల్ జిల్లాలోని ఘన్‌పూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈత చెట్టుపై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతిచెందాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. చెట్టుపై నుంచి కల్లు తీస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications