హరీష్ కాంగ్రెసులో చేరుతారని వార్తలు: రేవంత్ రెడ్డి, ప్రాణంపోయినా అంటూ గాంధీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మేనల్లుడు, మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు వస్తున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీకార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

గ్రేటర్‌ ఎన్నికలపై ప్రభావం చూపేలా ప్రభుత్వం పథకాలను ప్రకటిస్తోందని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దుర్గంచెరువుపై బ్రిడ్జి కడుతున్నట్లు, యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు వస్తోందంటూనమస్తే తెలంగాణ పత్రికలో ఊహాచిత్రాలు ప్రచురించారని ఆయన చెప్పారు.

According to media Haraish Rao may join Congress: Revanth Reddy

నమస్తే తెలంగాణ, టీన్యూస్‌ కథనాలను పెయిడ్‌ ఆర్టికల్స్‌గా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌ ఫిర్యాదు చేస్తామని రేవంత్ చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో ప్రాజెక్టుల్లో అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు.

ప్రాణం పోయినా తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని శాసనసభ్యుడు అరికపూడి గాంధీ స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. గాంధీ టిఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. బిజెపి మాజీ శాసనసభ్యుడు ప్రేంసింగ్ రాథోడ్ టిఆర్ఎస్‌లో చేరిన నేపథ్యంలో ఆ వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+