Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TJAC: విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ కంటే వెనకపడ్డా తెలంగాణ..!

గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి 10 శాతమే పెరిగిందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(TJAC) పేర్కొంది. ఇన్​స్టాల్డ్​పవర్​ కెపాసిటీని 7,770 మెగా వాట్ల నుంచి18,792 మెగావాట్లకు పెంచామని, దేశంలోనే ఇది రికార్డు అని సర్కారు చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. దాదాపు 11,022 మెగావాట్ల స్థాపిత విద్యుత్​ సామర్థ్యం పెరిగితే.. అందులో బీఆర్ఎస్ ​ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టు ప్రారంభించి పూర్తి చేసి సాధించిన కెపాసిటీ1,780 మెగావాట్లు మాత్రమేనని వివరించింది.

ఇది పెరిగిన మొత్తంలో10% లోపేనని చెప్పింది. ఈ విషయం తాము చెబుతున్నది కాదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) దేశంలో వివిధ రాష్ట్రాల విద్యుత్ స్థాపిత సామర్థ్యాలపై అక్టోబర్ లో ప్రచురించిన నివేదిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్నారు. తెలంగాణ ఇన్​స్టాల్డ్​పవర్​కెపాసిటీ 2014 జూన్​నాటికి 7,770 మెగావాట్లుగా ఉందన్నారు. ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో 2023 అక్టోబర్​31 నాటికి 18,792 మెగావాట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మొత్తం18,792 మెగావాట్లలో తెలంగాణ ప్రభుత్వం హయాంలో కొత్తగా ప్రాజెక్టు ప్రారంభించి పూర్తి చేసి నెలకొల్పిన విద్యుత్ ​సామర్థ్యం కేవలం1,780 మెగావాట్లు మాత్రమేనని నివేదికలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

According to TJAC, Telangana is behind AP in terms of electricity consumption

రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్​ఉత్పత్తి సంస్థ జెన్‌‌కో ఉండగా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎన్‌‌టీపీసీ, ఎన్‌‌హెచ్‌‌పీసీ, ఎన్‌‌పీసీ, ఎన్‌‌ఎల్‌‌సీ లాంటి సంస్థల నుంచి రాష్ట వాటా రావడం, ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా, సంప్రదాయేతర ఇంధనవనరుల ద్వారా రాష్ట్రానికి విద్యుత్ ​సమకూరుతున్నదని టీజేఏసీ వివరించింది. రాష్ట్రంలో జెన్‌‌కో ఉత్పత్తి చేసే కరెంట్ పావు వంతు అవసరాలకు కూడా సరిపోదని పేర్కొంది. ఇతర సంస్థల నుంచి వచ్చే కరెంట్ ను వాడుకుంటున్నారని తెలిపింది.

విద్యుత్ సరిపోకపోతే ఓపెన్‌‌ మార్కెట్ లో పవర్ ఎక్స్ ఛేంజెస్ ద్వారా రోజు వారీగా ఎప్పటికప్పుడు కరెంటు కొని సరఫరా చేస్తోందని పేర్కొంది. సీ‌‌ఈ‌‌ఏ నివేదిక ప్రకారం ఏపీ స్థాపిత సామర్థ్యం తెలంగాణ కంటే చాలా ఎక్కువ ఉందని టీజేఏసీ గుర్తు చేసింది. ఏపీ స్థాపిత సామర్థ్యం రాష్ట్రం విడిపోయే నాటికి 8,947 మెగావాట్లు ఉంటే, 31 అక్టోబర్ 2023 నాటికి 26,706 మెగావాట్లకు పెరిగిందని గుర్తు చేసింది. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో ఏపీ సాధించిన వృద్ధి 198 శాతమని వివరించింది. 2014 తర్వాత దేశం మొత్తం విద్యుత్ గ్రిడ్ లా మారిందన్నారు. దీంతో దేశంలో ఏ మూలనుంచైనా తక్కువ ధరకు కరెంట్ ​కొనే అవకాశం ఉందని టీజేఏసీ వివరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+