హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అచ్చం సినిమాల్లో లాగే దోపిడీ: రెండేళ్లనాటి కేసు మిస్టరీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రక్త సంబంధాన్ని కూడా పక్కన పెట్టి దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అచ్చంగా సినిమాల్లో లాగా దొంగతనం చేశాడు. బాబాయి కళ్లల్లో కారం చల్లి బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. రెండేళ్ల నాటి ఆ కేసును హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు.

రెండేళ్ల క్రితం బేగంబజార్‌ పోలీసు స్టేషన్‌లో ఈ దోపిడీ కేసు నమోదైంది. సిటీ కాలేజీ, ఘాన్సీబజార్‌కు చెందిన ప్రధాన సూత్రధారి షేక్‌ ఇమ్రాని పసిడి వ్యాపారి. జల్సాల కోసం చిన్నపాటి దొంగతనాలు చేసేవాడు. అతడి బాబాయ్ అమ్జద్‌అలీ కూడా బంగారం వ్యాపారం చేసేవాడు.

రెండు కిలోల ఆభరణాలను నెల్లూరు తీసుకెళ్లేందుకు అమ్జద్ అలీ ఆటోలో లకిడీకాపూల్‌ బయల్దేరాడు. బాబాయ్‌ని దోచుకోవాలని ఇమ్రాన్‌ పథకం వేశాడు. అతడి స్నేహితులు మహ్మద్‌ వసీం, మహ్మద్‌ ముజాహిద్‌, మహ్మద్‌ ఆజం, షౌకత, ముజీవుద్దీన్‌, జుబేర్‌తో కలిసి అందుకు సిద్ధపడ్డాడు.

ఆటో మాలకుంట రోడ్‌లోని ఓ హోటల్‌ వద్దకు రాగానే అమ్జద్‌ కళ్లల్లో కారంపొడి చల్లి ఆభరణాల బ్యాగును లాక్కుని ఉడాయించారు. దీనిపై 2014 ఆగస్టు 20వ తేదీన బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో అమ్జద్‌ ఫిర్యాదు చేశాడు.

గాలింపు చర్యలు..

గాలింపు చర్యలు..

కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. భయంతో షేక్‌ ఇమ్రాన్‌ సలీం అనే న్యాయవాదిని సంప్రదించి విషయం మొత్తం చెప్పాడు. కేసు నుంచి కాపాడతానని చెప్పి వారి వద్ద నుంచి న్యాయవాది 70 గ్రాముల ఆభరణాలు తీసుకున్నాడు. మిగతావి వారంతా కలిసి పంచుకున్నారు.

ఇలా ఛేదించారు...

ఇలా ఛేదించారు...

జూన్‌ 20వ తేదీన పోలీసులకు సమాచారం అందడంతో సౌతజోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం రంగంలోకి దిగింది. ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులతో దోపిడీ చేశామని అంగీకరించాడు.

ద్విచక్రవాహనాల స్వాధీనం..

ద్విచక్రవాహనాల స్వాధీనం..

నిందితుల నుంచి 800 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షలు, రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో సహా న్యాయవాదిపై కేసు నమోదు చేశారు.

మరో ఇద్దరు పరారీలో...

మరో ఇద్దరు పరారీలో...

టోలీచౌకికి చెందిన జుబేర్‌, మలక్‌పేటకు చెందిన సలీం పరారీలో ఉన్నారని టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ కోటిరెడ్డి చెప్పారు. నిందితులు ఆరుగురిని కోర్టులో

పోలీసులకు ప్రశంసా పత్రాలు..

పోలీసులకు ప్రశంసా పత్రాలు..

కేసును ఛేదించిన సౌత జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదగిరి, అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి. లక్ష్మణ్‌, ఎస్‌ఐలు బి. మధుసూదన్‌, జి. మల్లేష్‌, ఎస్‌.కె. జాకీర్‌హుస్సేన్‌ ఎన్‌. శ్రీశైలం తదితర సిబ్బందికి అడిషనల్‌ డీసీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు.

English summary
accused in a robbery case arrested in Hyderabad by south zone police after two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X