• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సతీసమేతంగా బాలకృష్ణ: మేడారంలో నిలువెత్తు బంగారం (ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: ప్రపంచంలోనే అరుదైన గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడం శుభపరిణామమని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. శుక్రవారం బాలకృష్ణ సతీ సమేతంగా మేడారం జాతరకు విచ్చేసి సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని సమ్మక్క-సారలమ్మను వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ జాతరకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఇటువంటి పండుగను ఓ రాష్ట్ర పండుగగా గుర్తించడం శుభపరిణామమని పేర్కొన్నారు.

Also Read: మేడారం: సారలమ్మ రాక అపూర్వ ఘట్టం(పిక్చర్స్)

మేడారం జాతర తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జాతరను రాష్ట్ర పండగగా గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజనుల పిల్లలకు ఉచిత విద్య, గురుకుల పాఠశాలల నిర్మాణం, జంపన్న వాగుపై వంతెన నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు.

‘మాజీ ముఖ్యమంత్రి, తమ తండ్రి నందమూరి తారకరామారావు గారి పాలనలో ప్రజలకు సామాజిక న్యాయం అందింది. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని, భోగభాగ్యాలతో తులతూగాలని కోరకుంటున్నాను' అని బాలకృష్ణ అన్నారు. అంతకుముందు మేడారం చేరుకున్న బాలయ్యకు అక్కడి వారు ఘన స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన రద్దు

తెలంగాణ ముఖ్యమంత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కేసీఆర్ మేడారం పర్యటన రద్దయింది. ఆయన జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని, అందువల్లే మేడారానికి ఆయన వెళ్లలేకపోయారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి శుక్రవారం నాడు కేసీఆర్ మేడారంలోని సమ్మక-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవాల్సి ఉంది.

శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి వనదేవతలను దర్శించుకొని భోజనం అనంతరం తిరిగి హైదరాబాద్ వచ్చేలా ఏర్పాటు చేశారు. అయితే సీఎం పర్యటన ఆకస్మాత్తుగా రద్దు అయింది. దీంతో పాటు కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన రద్దుతో మడికొండలో ఆయన పాల్గొనాల్సిన ఇన్‌క్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవం కూడా రద్దయింది.

 మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

మేడారం జనావర్ణమైంది. కోట్లాది భక్తుల కొంగుబంగారమై మురిసి మెరిసింది. వాతావరణం పసుపు పీతాంబరమైంది. చిలుకలగుట్ట నుంచి తనకు మాత్రమే తెలిసిన తావు నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్కను భువికి తీసుకురాగా.. జలకం వడ్డె అలుకు చల్లుతుండగా.. కొమ్ము వడ్డెలు బూర ఊదుతుండగా.. ఇష్టమైన డోలినాదం మోగుతుండగా సమ్మక్క తల్లి మేడారానికి సాయంత్రం 5.58 గంటలకు పయనమైంది.

 మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

చిలుకలగుట్ట నుంచి తల్లి కిందికి రాగానే ఆ గుట్టచుట్టూ చీమలుగా మారిపోయిన జనం ఒక్కసారిగా జై సమ్మక్క-జై తెలంగాణ అంటూ నినదించారు. తల్లి చిలుకలగుట్ట దిగుతుండగానే భక్తులు పులకించిపోయారు. చిలుకలగుట్ట దిగగానే తల్లి రాకకు సంకేతంగా జిల్లా రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా ఏకే 47తో 15 రౌండ్లు, గుట్టకింద ఉన్న చిలుకలవాగుకు రాగానే మరో 15 రౌండ్లు అక్కడి నుంచి మేడారం రోడ్డెక్కగానే మరోసారి తూటాల మోతతో తల్లికి స్వాగతం పలికారు.

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి జాతరకు అనేక ప్రత్యేకతల్ని సమ్మక్క సృష్టించుకున్నది. చిలుకలగుట్ట నుంచి మేడారం వరకు రెండు కిలోమీటర్ల పొడవునా ఆదివాసీ నృత్య సంప్రదాయాలతో మేడారం ప్రాంగణమంతా ఓలలాడింది. తల్లి రాకతో భూతల్లే ఎగిరి గంతేసిందా అన్నట్టు జాతర పరిసరాలన్నీ మారుమోగాయి.

 మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

అందరి ముఖాల్లో స్వరాష్ట్రంలో వైభవంగా తల్లి జాతర జరుపుకుంటున్నామనే సంబురం తొణికిసలాడింది. చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెల దాకా రెండు కిలోమీటర్ల మేర జై తెలంగాణ నినాదాలు, తల్లీ స్వాగతం అంటూ భక్తులు ముత్యపు ముగ్గులేశారు.

 మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఉన్న గద్దెలపైకి తల్లీ సమ్మక్క రాత్రి 8.06 గంటలకు చేరుకోవడంతో జాతర పరిపూర్ణమైంది. సర్కారు ప్రతినిధిగా జాతర చరిత్రలో తొలిసారిగా దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, జిల్లా యంత్రాంగం పక్షాన కలెక్టర్ వాకాటి కరుణ తల్లికి స్వాగతం పలికారు.

 మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

చిలుకలగుట్ట నుంచి తల్లిని తీసుకొచ్చే మహాద్భుత దృశ్యాన్ని కనులారా చూసేందుకు ఒళ్లంతా కండ్లు చేసుకున్న భక్తజనంతో చిలుకలగుట్ట జనగంగై ఉప్పొంగింది. ఎవరికి వారుగా.. తమకు మాత్రమే తెలిసిన రహస్యదారుల్లో తల్లి తావుకు చేరుకుని వేల, లక్షలుగా ఒక్కొక్కరుగా పత్రహరితంలో కలిసిపోయారు.

 మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

సమ్మక్కముందు సాగిలపడ్డారు. చేసిన తప్పులు మన్నించాలని మేడుకున్నారు. తప్పులు దిద్దుకుంటామని బాసచేశారు. తల్లి గ్రామపొలిమేరల్లోకి రాగానే మేడారంవాసులు నీళ్లారగించి, పసుపు, కుంకుమలతో పదేళ్ల పబ్బతి పట్టి స్వాగతం పలికారు.

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

అక్కడి నుంచి గద్దెల ప్రాంగణానికి రాగానే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఐజీ నవీన్‌చంద్, డీఐజీ బీ మల్లారెడ్డి, కలెక్టర్, ఎస్పీ సహా అధికారయంత్రాంగం అంతా అతిసామాన్యులై తల్లికి ప్రణమిల్లి స్వాగతం పలికారు.

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

చిలుకలగుట్ట పాదాల దగ్గరి నుంచి మేడారం దాకా సకల సర్కార్ యంత్రాంగం తల్లిని గద్దెకు చేర్చేదాకా కాలికి చెప్పులు కూడా లేకుండా మోకరిల్లారు. సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యను చేరుకుని పదేళ్ల పబ్బత్తి పట్టి తల్లి నీకు స్వాగతం.. నీ రాజ్యానికి స్వాగతం.. మీ గద్దెకు గౌరవంగా మిమ్మల్ని తోడుకుని వెళ్తాం అనుమతి ఇవ్వండి అంటూ సకల యంత్రాంగం తల్లికి స్వాగతం పలికారు.

 మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

మేడారం జాతరలో సతీసమేతంగా బాలకృష్ణ, కేసీఆర్ పర్యటన రద్దు

సమ్మక్కను తీసువచ్చే వడ్డెలను తాకి పునీతమయ్యేందుకు భక్తులు పోటీలు పడ్డారు. వడ్డెలను తాకితే సమ్మక్కను తాకినట్లే, జన్మ ధన్యమైనట్టే అన్నట్టుగా పోలీసులను సైతం లెక్కచేయకుండా భక్తులు దూసుకెళ్లారు. రెండేండ్లుగా కోట్లాది కండ్లు ఎదురు చూస్తున్న అపూర్వఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు చిలుకలగుట్ట చుట్టూ బారులుతీరారు.

సతీసమేతంగా బాలకృష్ణ: మేడారంలో నిలువెత్తు బంగారం

సతీసమేతంగా బాలకృష్ణ: మేడారంలో నిలువెత్తు బంగారం

సతీసమేతంగా బాలకృష్ణ: మేడారంలో నిలువెత్తు బంగారం

సతీసమేతంగా బాలకృష్ణ: మేడారంలో నిలువెత్తు బంగారం (ఫోటోలు)

సతీసమేతంగా బాలకృష్ణ: మేడారంలో నిలువెత్తు బంగారం (ఫోటోలు)

సతీసమేతంగా బాలకృష్ణ: మేడారంలో నిలువెత్తు బంగారం

సతీసమేతంగా బాలకృష్ణ: మేడారంలో నిలువెత్తు బంగారం (ఫోటోలు)

సతీసమేతంగా బాలకృష్ణ: మేడారంలో నిలువెత్తు బంగారం (ఫోటోలు)

సతీసమేతంగా బాలకృష్ణ: మేడారంలో నిలువెత్తు బంగారం

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor turned Politician Hero Balakrishna visits Medaram Jatara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more