కేటీఆర్‌కు మద్దతుగా అనసూయ ట్వీట్
తెలంగాణ ఎన్నికల ఫలితాలు అధికార బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చాయనే చెప్పాలి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీకి తొలిసారి గట్టి షాక్ తగిలింది. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి ఆ పార్టీ ఓటమి దిశగా అడుగులు వేస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటడంతో.. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడానికి సన్నద్ధం అవుతుంది.

ఇక ఈ ఓటమిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఓటమిని అంగీకరిస్తున్నామని.. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారాయన. ఈ రోజు ఫలితం గురించి బాధపడలేదు, కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందాను. కానీ మేము దీన్ని ఒక అభ్యాసంగా తీసుకుంటాము మరియు తిరిగి పుంజుకుంటామని చెప్పుకొచ్చారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారాయన.ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ.. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు నటి అనసూయ స్పందించారు. ఆమె కేటీఆర్‌కు మద్దతుగా నిలిచారు. మీరు నిజమైన నాయకుడు సార్.. ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు.. అన్ని పురోగతి కూడిన హైదరాబాద్‌తో నేను ప్రేమలో పడ్డాను.. బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తూ.. ధన్యవాదాలు అంటూ ట్విట్టర్‌తో పోస్ట్ పెట్టింది.












Click it and Unblock the Notifications