నా పరువు తీశారు, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవద్దు: సిట్‌పై హైకోర్టుకు చార్మి
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ నటి చార్మి సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు డ్రగ్స్ కేసుకు సంబంధించి జులై 26న విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చార్మి హైకోర్టు రిట్ పిటిషన్ వేశారు.

విచారణపై ఆరోపణ
డ్రగ్స్ కేసులో బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం సరికాదని చార్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేగాక, సిట్ విచారణ తీరు సరిగా లేదని చార్మి ఆరోపించారు. తనకు డ్రగ్స్‌తో సంబంధం లేకున్నా నోటీసులు ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
Recommended Video


పరువు తీశారు..
నోటీసులు అందించి తనను వ్యక్తిగతంగా అవమానించారని, తన పరువు బజారుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో సిట్ ముందు హాజరుకానున్న నేపథ్యంలో చార్మి హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పెళ్లికాని అమ్మాయిని..
ఆర్టికల్ 20సబ్ క్లాస్ ప్రకారం బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారని చార్మి పేర్కొన్నారు. అంతేగాక, విచారణ సమయంలో అడ్వొకేట్‌ను వెంటతీసుకొచ్చేందుకు వెసులుబాటు కల్పించాలని చార్మి కోరారు. తాను అమ్మాయిని కాబట్టి తన వద్దకే సిట్ అధికారులు రావాలని తెలిపారు. తాను పెళ్లి కాని అమ్మాయినని, తన బ్లడ్ శాంపిల్స్, గోర్లు తీసుకోవడం సరికాదని చెప్పారు. తాను షూటింగ్‌కి వెళ్తే తన తల్లిదండ్రులతో కలిసి వెళ్తానని తెలిపారు. తనకు సినీ ఇండస్ట్రీలో, బయటా చాలా మంచి పేరుందని, నోటీసుల మూలంగా తాను ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని తెలిపారు. తాను డ్రగ్స్, అల్కాహాల్ ఎప్పుడూ తీసుకోలేదని చార్మి చెప్పారు. కాగా, చార్మి పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారించనుంది. దీంతో ఆమె కూడా హైకోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది.

లేడీ అధికారుల కోసం వేట
కాగా, సిట్ అధికారులు నోటీసులు అందుకున్న మహిళా నటులను ప్రశ్నించేందుకు మహిళా అధికారులను నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మహిళా అధికారులైతేనే నోటీసులందుకున్న చార్మి, ముమైత్ ఖాన్ లాంటి వారి నుంచి కీలక సమాచారం రాబట్టవచ్చని సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నిపుణులైన మహిళా అధికారుల కోసం సిట్ వేట కొనసాగిస్తోంది.

అకున్, చంద్రవదన్‌లకు నోటీసులు
చార్మి పిటిషన్ పరిశీలించిన హైకోర్టు.. ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సూపరింటెండెంట్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరంతా మంగళవారం విచారణ సందర్భంగా వివరణ ఇవ్వనున్నారు. కాగా, డ్రగ్స్ కేసులో సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడతామని చంద్రవదన్, అకున్ సబర్వాల్ చెప్పారు. డ్రగ్స్ విషయంలో జిల్లా అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications