మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు: ఇది ఆదిలాబాద్ కాంగ్రెస్ దుస్థితి

ఒక పరాజయం మరో విజయానికి తొలి మెట్టు అని నానుడి. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైన రీతిలో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది.

హైదరాబాద్: ఒక పరాజయం మరో విజయానికి తొలి మెట్టు అని నానుడి. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైన రీతిలో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకునే విషయమై ఆ పార్టీ నేతలకు స్పష్టత ఉన్నట్లు కనిపించడం లేదు.

తెలంగాణ ఉద్యమ రథ సారథిగా టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యూహాత్మక ఎత్తుగడల ముందు గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ అందుకు కారణాలేమిటన్న విషయమై ఆత్మ విమర్శ దిశగా ముందుకు వెళుతున్నట్లు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పథకాల్లో లోపాలను ఎలుగెత్తి చూపే సువర్ణావకాశాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేజేతులుగా వదులుకోవడానికి ఆ పార్టీలోని నేతలు అనుసరిస్తున్న వైఖరే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములాటలతో శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా సాగుతున్న ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా ఆ పార్టీ అధిష్ఠానం చర్యలు చేపడుతోందని తెలుస్తోంది. దీంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి కోసం నేతలు పైరవీలు ప్రారంభించారు.

బోథ్‌లో దూసుకెళ్తున్న అనిల్ జాదవ్

బోథ్‌లో దూసుకెళ్తున్న అనిల్ జాదవ్

పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సీ రామచంద్రారెడ్డి, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి భార్గవ్ దేశ్‌పాండే, టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత కూడా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముగ్గురు నేతలు కూడా చేపట్టే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనిల్ జాదవ్ వర్గ విభేదాలకు అతీతంగా వ్యవహరిస్తూ అందరితో కలిసిపోతూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారని తెలుస్తున్నది. తద్వారా బోథ్ అసెంబ్లీ స్థానం పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయాత్తం అవుతున్నాయి.

 నిర్మల్‌లో సడలని అల్లోల పట్టు

నిర్మల్‌లో సడలని అల్లోల పట్టు

తొలి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి నాయకత్వం అంటే జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నేతలకు మంటేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జిల్లాల విభజన తర్వాత కూడా ఆయన్నే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ అధిస్ఠానం నిర్ణయించడం కూడా పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. గతంలో జిల్లా ఇన్ చార్జిగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందే మహేశ్వర్ రెడ్డి, ఆయన ప్రత్యర్థులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. మహేశ్వర్ రెడ్డి ఆధిపత్యం కోసం జిల్లాలో వర్గాన్ని పెంచి పోషిస్తున్నాడని ఇతర నేతలు ఆరోపిస్తున్నారు.

అల్లోల్ల వల్ల కాంగ్రెసుకు తిప్పలు...

అల్లోల్ల వల్ల కాంగ్రెసుకు తిప్పలు...

ఆదిలాబాద్ జిల్లాలో పటిష్టమైన క్యాడర్ ఉన్నా సరైన నాయకత్వం లేక అధికార టీఆర్ఎస్ కు ఎదురు నిలువ లేకపోతున్నామన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగి మూడేళ్లు దాటినా ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు గుణపాఠం నేర్చుకోవడం లేదని చెబుతున్నారు. మండల, గ్రామ స్థాయి నేతలు కూడా వర్గాలుగా విడిపోయారన్న విమర్శ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి బీఎస్పీ తరఫున ఎన్నికైన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రిగా ఉన్నారు. తాజా పరిస్థితుల్లో నిర్మల్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అనుమానమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 కాంగ్రెస్ శ్రేణులను ఆకర్షించేందుకు గులాబీ వ్యూహం

కాంగ్రెస్ శ్రేణులను ఆకర్షించేందుకు గులాబీ వ్యూహం

పార్టీ అధికారంలో లేకున్నా.. తమ వర్గం నాయకుడి పట్ల కాంగ్రెస్ శ్రేణులు అభిమానం చూపడం.. అనైక్యతతో వ్యవహరించడంతోనే తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిప్రాయం వినిపిస్తున్నది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం.. గ్రామ స్థాయిలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటుందని సమాచారం. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ ద్వారా గులాబీ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడికి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నదని సమాచారం. పొరుగు జిల్లా నుంచి నేతను అరువు తెచ్చుకున్నా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తుందా? అన్నదీ అనుమానమే సుమా!.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+