ఆటోలో తీసుకెళ్లి భర్తను కొట్టి భార్యపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్: ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్‌రోడ్డు అటవీ ప్రాంతంలో ఓ గిరిజన మహిళపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై మంగళవారం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వరంగల్‌ జిల్లా మంగపేట మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ గొత్తికోయ మహిళ భర్తతో ఆదివారం భద్రాచలంలో సామాన్లు కొనుగోలుకు వచ్చారు.

ఆదివారం రాత్రి పొద్దుబోయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి భద్రాచలం వద్ద మణుగూరు వెళ్లే ఆటో ఎక్కారు. అప్పటికే ఈ ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. మణుగూరు క్రాస్‌ రోడ్డు సమీపం రాగానే ఆటోను అడవిలోకి తీసుకువెళ్లి భర్తను కొట్టారు. ఆటో డ్రైవర్‌తో సహా మిగతా ముగ్గురు అత్యాచారం చేశారు. ఆమెను అక్కడే వదిలేసి వెళ్లారు. సోమవారంరాత్రి పోలీస్‌ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు.

పిల్లలతో తల్లి ఆత్మహత్య

Adiwasi woman gang raped in Khammam district

రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చిన్నబండతండాలో ముగ్గు రు పిల్లలతో కలిసి తల్లి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నది. తండాకు చెందిన ఇస్లావత్ శ్రీను, లక్ష్మి (28)లకు పదేండ్ల కిందట వివాహమైంది. వీరికిపద్మ (9), ప్రేంకుమార్ (5), కార్తీక్ (4) సంతానం. శ్రీను బతుకుదెరువు కోసం రెండేండ్ల కిందట దుబాయ్ వెళ్లాడు. అక్కడ సరిగా పనిదొరక్క డబ్బు పంపించకపోవడం, అప్పు తీర్చేదారి లేక, పిల్లల పోషణ భారం కావడంతో పిల్లలతో కలిసి సొంతపొలంలోని బావిలోకి దూకి లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది.

రైలు ఢీకొని మనవరాలు, నానమ్మ మృతి

ప్రమాదవశాత్తు రైలు ఢీకొన్న ఘటనలో నానమ్మ, మనుమరాలు దుర్మరణం చెందారు. వరంగల్‌లోని గిర్మాజిపేటకు చెందిన వోలం స్వరాజ్యం (58) ఆమె మనుమరాలు అక్షయ (5)తో కలిసి మంగళవా రం స్టేషన్‌ఘన్‌ఫూర్‌లోని బంధువు యెర్రం రవిప్రకాశ్ ఇంట్లో విందుకు బయలుదేరారు. రాత్రి 7.30 గంటలకు ఘన్‌పూర్ రైల్వే గేటు ట్రాక్ దాటుతుండగా, సికింద్రాబాద్ నుంచి కాజీపేట వైళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+