ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై అల్లం నారాయణకు ఫిర్యాదు
హైదరాబాద్: జర్నలిజం ముసుగులో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు కొంతం గోవర్ధన్‌రెడ్డి, ఉపేంద్ర శుక్రవారం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు ఫిర్యాదు చేశారు.

కొన్ని నెలలుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటు సభ్యులపై నిరాధారమైన, అసత్య కట్టుకథలను ప్రచురిస్తున్నారని అన్నారు. వరంగల్ ఉపఎన్నిక సందర్భంగా కూడా అసత్య కథనాలు ప్రచురించారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలను కూడా కించపరుస్త్తూ, వ్యక్తిగత కక్షతో కట్టుకథలతో వార్తలను ప్రచురిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.












Click it and Unblock the Notifications