టీఎస్ఆర్టీసీ బాదుడే బాదుడు: ప్యాసింజర్, డీజిల్ సెస్.. ఇప్పుడు రిజర్వేషన్ ఛార్జీల పెంపు
హైదరాబాద్: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ వరుస షాకులిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు టికెట్ ఛార్జీలు పెంచగా.. మరోసారి ఛార్జీలు పెంచి ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలతోనే ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులపై ఇప్పుడు అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ ఛార్జీలను పెంచి మరో భారం మోపింది.

టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలు
గతంలో రూ.20 ఉండగా మరో రూ.10 పెంచింది. ఇకపై, ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే 30 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.ఇటీవలే టికెట్ ఛార్జీలను ఆర్టీసీ పెంచిన విషయం తెలిసిందే. టికెట్ తీసుకుంటున్న ప్రయాణికులు కొత్త ఛార్జీలను చూసి కంగుతింటున్నారు. ప్రయాణికులకు ఎటువంటి సమాచారం లేకుండా ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచడమేంటని మండిపడుతున్నారు. కొద్ది వారాల వ్యవధిలోనే మూడుసార్లు ఛార్జీలు పెంచడమేంటని ప్రశ్నిస్తున్నారు.

డీజిల్ సెస్
కాగా, ఇప్పటికే ఆర్టీసీ రెండుసార్లు ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. డీజిల్ సెస్ పేరుతో ఛార్జీలను ఇటీవల పెంచారు. డీజిల్ సెస్ పేరుతో పెంచిన చార్జీలు ఆయా బస్సుల్లో రెండు కేటగిరీలుగా అమలు కానున్నాయి. పల్లె వెలుగు, ఆర్డినరీ, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రూ.2 పెరగనున్నాయి. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏకంగా రూ.5 పెరగనుంది. ఏ బస్సులోనైనా ఇకపై కనీస టికెట్ ధరను రూ.10కు పెంచుతూ కూడా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

ప్యాసింజర్ సెస్
ప్యాసించర్ సెస్ పేరుతో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ. 5 చొప్పున.. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ. 10 వరకు టికెట్ రేట్లను పెంచింది. పెంచిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంపుతో ఆందోళన చెందుతుంటే.. తాజాగా, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచుతారా? అని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇలా అన్ని ధరలు పెంచేస్తే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఆకస్మికంగా పెరుగుతున్న బస్సు ఛార్జీలతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications