• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈటల తరువాత ఆ మంత్రేనా : రీప్లేస్ మెంట్ కు రెడీ..ఏం జరుగుతోంది..!!

By Lekhaka
|

తెలంగాణ కేబినెట్ లో మరో మంత్రి పైన వేటు పడబోతోందా. ఏం జరుగుతోంది. ఇప్పుడు ఇదే చర్చ టీఆర్ఎస్ పార్టీలో జోరుగా సాగుతోంది. కొద్ది రోజుల క్రితమే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల పైన భూకబ్జా ఆరోపణలు రావటంతోనే విచారణ..ఉద్వాసన చకాచకా జరిగిపోయాయి. ఇప్పుడు ..మరో మంత్రి పైన కత్తి వేలాడుతుందంటూ ప్రముఖ ఆంగ్ల పత్రికలో కధనాలు వచ్చాయి. దీంతో..ఆ మంత్రి పైన వేటు ఖాయ మని చెబుతూ..ఆయన స్థానంలో అదే జిల్లాకు చెందిన మరో నేతకు క్యాబినెట్ లో బెర్తు అంటూ చెబుతున్నారు.

 జగదీష్‌ రెడ్డికి చెక్ పెట్టనున్నారా..?

జగదీష్‌ రెడ్డికి చెక్ పెట్టనున్నారా..?

నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి మొదటి నుండి కేసీఆర్ కు అనుచరుడుగా ఉంటూ వస్తున్నారు. విధేయుడిగా ఉన్నారు. ఆయనకు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే మంత్రి పదవి దక్కింది. రెండో విడత ప్రభుత్వంలోనూ మరో ఆలోచన లేకుండా కేబినెట్ లో స్థానం కల్పించారు.కేసీఆర్ కు నచ్చేవి ఏంటీ..నచ్చనవి ఏంటీ అనేది జగదీష్ రెడ్డికి బాగా తెలుసు. అయితే, కొద్ది రోజుల క్రితం జగదీష్ రెడ్డి తన కుమారుడి జన్మదిన వేడుకలు హంపిలో నిర్వహించారు.

ఈ వేడుకకు జగదీష్ రెడ్డితో పాటుగా మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యారు. అక్కడ పార్టీలో రాజకీయ పరిస్థితులు...ఈటల పెట్టబోయే పార్టీ అంటూ చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఒక ఎమ్మెల్యే కేసీఆర్ పైన పాట కూడా పాడారని చెబుతున్నారు. అయినా జగదీష్ రెడ్డి మౌనంగా చూస్తూ ఉండిపోయారట. ఇది ముఖ్యమంత్రి వరకు చేరిందని సమాచారం. దీంతో..ఈటల వ్యవహారం చూసిన తరువాత కేసీఆర్ గురించి బాగా తెలిసిన జగదీష్ రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు. సీఎం ను కలిసి వివరణ ఇచ్చుకొనే ప్రయత్నం చేసారు.

 పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేబినెట్ బెర్త్..?

పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేబినెట్ బెర్త్..?

కానీ, కేసీఆర్ మాత్రం మెత్తబడలేదు. దీంతో..మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసి నల్గొండ జిల్లా నుండి జగదీష్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షించే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డికి అవకాశం కల్పిస్తారనేది పార్టీలో సాగుతున్న ప్రచారం. అయితే, ఆంగ్ల పత్రిక కధనం పైన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేసారు. అందులో కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆ కార్యక్రమంలో పాల్గొన్నాంటూ కొందరు ఎమ్మెల్యేల పేర్లు పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఆ ట్వీట్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు..రచ్చకు దారి తీస్తోంది. మంత్రి పైన నిజంగా కేసీఆర్ వేటు వేస్తారా...అయితే, త్వరలో మంత్రివర్గ విస్తరణ తప్పదంటూ ఆశావాహులు మరింతగా విధేయత చాటుకొనేందుకు సిద్దమైపోతున్నారు.

గీత దాటితే వేటే..?

గీత దాటితే వేటే..?

ఇదే సమయంలో ఇతర పార్టీల నుండి వలసలు గులాబీ పార్టీలోకి తిరిగి మొదలయ్యాయి. అందులో భాగంగానే టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరిక ఖాయమని తెలుస్తోంది. ఇక, ఎవరు హద్దులు దాటినా వేటు తప్పదనే సంకేతాలు గులాబీ బాస్ నుండి వస్తున్నాయి. ఎంత మంది పోయినా..వచ్చే మంది లిస్టు చాలానే ఉందని చెబుతున్నారు. దీంతో..ఇక, ఇప్పుడు కేబినెట్ లో మంత్రులు...విస్తరణ.. వేటు అనే అంశం పైన ఆసక్తి కర చర్చలు కొనసాగుతున్నాయి.

English summary
After Eetela Rajender, sources say that another minister Jagadish Reddy will be sacked from KCR cabinet.Revanth Reddy also tweets the same that gives strength to the statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X