మాజీ సీఎం కు తెలంగాణ బాధ్యతలు- రాహుల్ ఆకస్మిక నిర్ణయం వెనుక, ఇక నుంచి..!!

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా వివాదాలు.. నిర్ణయాల వేళ పార్టీ హైకమాండ్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాల పైన ఫోకస్ చేసిన పార్టీ నాయకత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ లో కీలక నిర్ణయాలకు సిద్దమైంది. అందు లో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మార్పు చేస్తున్నారు. మాజీ సీఎంకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక నేరుగా పార్టీ హైకమాండ్ తెలంగాణలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించాలని నిర్ణయించినట్లు సమాచారం.

తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహారాల పైన రాహుల్ ఫోకస్ చేసారు. పార్టీ విజయం సాధించిన తరువాత దీపాదాస్ మున్షీని పార్టీ ఇంఛార్జ్ గా నియమించారు. కాగా, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో అవసరాలు.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కొత్త ఇంఛార్జ్ ల నియామకం పైన నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇక, ప్రస్తుత తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ స్థానంలో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బగెల్ ను నియమించాలని డిసైడ్ అయ్యారు. మీనాక్షీ సేవలు త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వినియోగించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుత మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే పంజాబ్, గోవా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ పైన కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. అక్కడ ప్రత్యేకం గా ఎంపికగా చేసిన పార్టీ నేతలను మొహరిస్తోంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ నాయకత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి.

BRS నేతలతో కేసీఆర్ భేటీ - రాజీనామా, బస్సు యాత్ర పై కీలక నిర్ణయం..!?
BRS నేతలతో కేసీఆర్ భేటీ - రాజీనామా, బస్సు యాత్ర పై కీలక నిర్ణయం..!?
aicc-likely-to-appoint-bhupesh-bhagal-as-telangana-party-in-charge-in-place-of-meenakshi-natarajan

తెలంగాణ పై కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్

ఇదే సమయంలో తెలంగాణలో పార్టీని మరింతగా బలోపేతం చేయటంతో పాటుగా పీసీసీ - జిల్ కేడర్ మధ్య సమన్వయం కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కొనసాగుతోంది. కొండా సురేఖ వేటు విషయంలో కఠినంగా వ్యవహరించిన పార్టీ నాయకత్వం ఎక్కడా పార్టీకి నష్టం చేసే చర్యలను ఉపేక్షించకూడదని నిర్ణయించింది. మీనాక్షి నటరాజన్ కు పంజాబ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్ లో కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే పూర్తి సానుకూల ఫలితాలు వస్తాయని పార్టీ అంచనా వేస్తోంది. అందులో భాగంగా కీలక నేతలకు ఆ రాష్ట్రాల్లో మొహరిస్తోంది. తెలంగాణలోనూ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా... ప్రభుత్వం- పార్టీ మధ్య సమన్వయంతో పాటుగా వ్యూహాలను అమలు చేసే విధంగా కొత్త ఇంఛార్జ్ విషయంలో పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకం పైన పార్టీ నాయకత్వం అధికారి కంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+