విషమంగానే తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం: హెల్త్ బులిటెన్
హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. మంగళవారం రాత్రి ఏఐజీ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభద్రం వెంటిలేటర్ సపోర్ట్‌తో ఖమ్మం నుంచి ఏఐజీకి వచ్చారని తెలిపారు. తమ్మినేనికి ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు.
ఆయన గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల నుంచి నీరును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయని డాక్టర్లు తెలిపారు. ఆయనకు వివిధ విభాగాల నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. మంగళవారం ఉదయం రూరల్ మండలం తెల్దార్ పల్లిలోని నివాసంలో తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది.

ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో మొదట ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రంను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలసుకున్నారు.
కాగా, తమ్మినేని వీరభద్రం లంగ్స్ ఇన్ఫెక్షన్ తోపాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అంబులెన్స్ లో తమ్మినేని వీరభద్రంను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, గతంలో కూడా తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు అప్పుడు స్టంట్ వేశారు. తాజాగా, మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో ఆందోళన నెలకొంది.












Click it and Unblock the Notifications