3 నుంచి అవినీతి వ్యతిరేక వారోత్సవాలు: ఓటుకు నోటు కేసుపై ఏకే ఖాన్

హైదరాబాద్: డిసెంబర్ 3 నుంచి ఏసీబీ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏసీబీలో అవినీతి అధికారులకు స్ధానం లేదన్నారు.

వారోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఉంటాయని తెలిపారు. అవినీతిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 AK Khan says anti corruption bureau celebrations in telangana

ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడుతూ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. కరీంనగర్ ఎఎస్సై మోహన్ రెడ్డి కేసులో సీఐడీ నివేదిక రాగానే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

అవినీతిని అంతం చేసేందుకు పటిష్టంగా పని చేస్తున్నామని స్పష్టం ఆయన చేశారు. ఏసీబీలో సిబ్బంది కొరత ఉన్నా నిజాయితీ గల అధికారులతో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

 AK Khan says anti corruption bureau celebrations in telangana

వనస్థలిపురంలో చైన్‌స్నాచర్ మురళీకృష్ణ అరెస్ట్

చైన్ స్నాచింగ్‌లో ఆరితేరిన ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన మురళీకృష్ణ అనే వ్యక్తిని వనస్థలిపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2013 నుంచి వనస్థలిపురంతో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో మురళీకృష్ణ గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి నుంచి భారీగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+