నాపై రివాల్వర్లతో దాడి: కోర్టులో తనపై దాడి చేసిన వారిని గుర్తించిన అక్బరుద్దీన్
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తన పైన గతంలో జరిగిన హత్యాయత్నం కేసులో మంగళవారం నాడు నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై బుధవారం కూడా కోర్టులో విచారణ కొనసాగనుంది.

తన శరీరంలో ఇంకా బుల్లెట్ ఉందని అక్బరుద్దీన్ కోర్టులో చెప్పారు. కత్తులు, రివాల్వర్లతో తన పైన దాడికి పాల్పడ్డారని చెప్పారు. తన వద్ద వెపన్ లాక్ చేయబడి ఉందని చెప్పారు. తన తుపాకీని తిరిగి ఇప్పించాలని కోర్టును కోరారు. అయితే, పిటిషన్ దాఖలు చేయాలని అక్బరుద్దీన్‌కు న్యాయస్థానం సూచించింది.

అక్బరుద్దీన్ పదమూడు మంది నిందితులను కోర్టులో గుర్తించారు. తన పైన దాడి జరిగిన తీరును ఆయన కోర్టుకు వివరించారు. అనంతరం కోర్టు కేసును వాయిదా వేసింది. రేపు విచారణ జరగనుంది. కాగా, పాతబస్తీలోని బార్సక్ ప్రాంతంలో అక్బర్ పైన గతంలో హత్యాయత్నం జరిగింది. అక్బర్‌తో పాటు నిందితులు కోర్టుకు హాజరయ్యారు. దీంతో, కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!?












Click it and Unblock the Notifications