బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటి కావాలి: సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ

హైదరాబాద్: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్.. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రగతిభవన్‌​లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, జాతీయ రాజకీయాలపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.

కాగా, ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో అఖిలేశ్​​ యాదవ్‌​కు మంత్రులు తలసాని శ్రీనివాస్​ యాదవ్, వేముల ప్రశాంత్​ రెడ్డి స్వాగతం పలికారు. 'బీజేపీని గద్దె దింపాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలి. బీజేపీని గద్దె దించడమే విపక్షాల లక్ష్యం. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులను కలుపుకోవాలి. విపక్షాల పోరాటంపై కేసీఆర్‌తో చర్చించేందుకు వచ్చా' అని అఖిలేశ్​ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 Akhilesh yadav meets cm kcr at pragathi Bhavan

అనంతరం అఖిలేశ్​ యాదవ్.. బేగంపేట​ విమానాశ్రంయ నుంచి రోడ్డు మార్గాన నేరుగా ప్రగతి భవన్​ చేరుకున్నారు. సీఎం కేసీఆర్​ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇరువురు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో పరిస్థితులు, జాతీయ రాజకీయాలపై వారు చర్చించనున్నట్లు తెలసింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

గతంలోనూ ఇరువురి మధ్య పలు సందర్భాల్లో చర్చలు జరిగాయి. ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశం.. త్వరలో బెంగళూరు వేదికగా జరగనున్న మరో దఫా భేటీ నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యత సంతరించుకొంది. మొదటి విపక్షాల భేటీకి బీఆర్ఎస్‌కు ఆహ్వానం అందని విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉంటున్నామని బీఆర్ఎస్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అఖిలేష్ యాదవ్.. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని కలుపుకుపోవాలని సూచించారా? అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+