సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున, అమల

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాగార్జున దంపతులు కలవడం ఇదే తొలిసారి. మర్యాదపూర్వకంగా కలిసినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రికి వీరిద్దరూ పుష్పగుచ్ఛం అందజేసి ఫొటోలు కూడా దిగారు. రేవంత్ సీఎం అయిన తర్వాత సినీ పరిశ్రమ నుంచి తొలిసారిగా చిరంజీవి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత నాగార్జున, అమల కలిశారు.

శ‌నివారం ఉద‌యం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న నాగార్జున దంపతులు రేవంత్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు ఆయన్ను కలుస్తున్నారు. త్వరలోనే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులంతా రేవంత్ ను కలవబోతున్నారు. దీనికి సంబంధించిన అపాయింట్ మెంట్ ను కూడా తీసుకున్నారు.

Akkineni Nagarjuna and akkineni amala Meet Telagana CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు దిశగా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టారు. అక్కినేని నాగార్జున 'నా సామిరంగ' అనే సినిమాలో నటిస్తున్నారు. మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ గ్లింప్స్​తో అందరిని ఆకట్టుకుంది. సంక్రాంతికి విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో చంద్రబాబునాయుడుకానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండుసార్లు బాధ్యతలు చేపట్టిన కేసీఆర్... ఇలా అందరూ సినీ పరిశ్రమకు అండగానే నిలిచారు. పరిశ్రమ పెద్దలంతా త్వరలోనే సీఎంను కలిసి ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+