అలర్ట్: హైదరాబాద్‌లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఆదివారం (జనవరి 26న) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే, రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ క్రమంలో వాహనదారులు, ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు.

జనవరి 26న ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 4 గంటల నుంచి 7 గంటల వరకు రాజ్‌భవన్‌ మార్గం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు, ప్రజలు తమ ప్రయాణాలను నిర్దేశించుకోవాలి.

Alert Traffic restrictions in Hyderabad on Sunday

పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మార్గంలో వచ్చే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలైన టివోలి ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మార్గాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులు కాస్త ముందుగా బయల్దేరి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కాగా, 76వ గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

నాలుగు పథకాలకు శ్రీకారం

గణతంత్ర దినోత్సవ శుభదినం జనవరి 26న ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి లబ్దిదారుడికి పథకం అందేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

నాలుగు ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్న అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డితో సమీక్షా సమావేశం తర్వాత మంత్రులు మీడియాకు ముఖ్యాంశాలు వెల్లడించారు. జనవరి 26న రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక గ్రామంలో నూటికి నూరు శాతం అమలు చేయడం ద్వారా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. కొత్తగా లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున జనవరి 26 నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+