హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణాలో ఏలియన్ షిప్స్ ప్రచారం: వికారాబాద్ పంటపొలాల్లో, హైదరాబాద్ ఆకాశంలో వింత శకటాలే కారణం!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రెండు చోట్ల వింత సంఘటనలు జరిగాయి. హైదరాబాద్ లో ఆకాశంలో ఈరోజు గ్రహం మాదిరి కదులుతున్న ఒక ఆకారం నగరవాసులను ఆశ్చర్యానికి గురి చేస్తే, ఇక వికారాబాద్ లో ఏకంగా ఒక వింత శకటం పంట పొలాల్లో పడడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఏలియన్ షిప్ కావచ్చు అని రెండింటి విషయంలో వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే ..

మొగిలి గుండ్లలో పంట పొలాల్లో పడిన భారీ వింత శకటం

మొగిలి గుండ్లలో పంట పొలాల్లో పడిన భారీ వింత శకటం


వికారాబాద్ జిల్లాలోని మొగిలి గుండ్లలో పంట పొలాల్లో ఒక భారీ వింత శకటం వచ్చి పడింది. దాదాపు వెయ్యి కిలోల బరువున్న ఈ వింత శకటాన్ని చూసిన స్థానికులు ఇది ఏమిటోనన్న భయాందోళనకు గురవుతున్నారు. అచ్చం ఆదిత్య 369 సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటం పై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఏలియన్ షిప్ అంటూ ప్రచారం

ఏలియన్ షిప్ అంటూ ప్రచారం

ఉన్నట్టుండి ఓ తెల్లటి వస్తువు ఆకాశంలో నుంచి పంటపొలాల్లో పడినట్టుగా స్థానికులకు కనిపించింది. అయితే ఇది వెయ్యి కిలోల బరువుండే హీలియం బెలూన్ గా సైంటిస్టులు చెబుతున్నారు. ఇక కొందరు ఇది ఏలియన్ షిప్ అంటూ రకరకాల ప్రచారం చేస్తున్నారు. అయితే అది వెదర్ రీసెర్చ్ బెలూన్ అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీంతో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండబోదని, ఎవరు భయపడవద్దని చెబుతున్నారు. ఇక గ్రామస్తులు అధికారులకు దీనిపై సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి తహసిల్దార్ వెళ్లి దాని పూర్వాపరాలను పరిశీలించనున్నారు.

వింతగా చూస్తున్న జనాలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

వింతగా చూస్తున్న జనాలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్


ఇక ఎక్కడనుండో వచ్చి పంట పొలాల్లో పడిన ఈ శకటాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు. దాని చుట్టూ తిరుగుతూ దాని లోపల ఏముందో చూసే ప్రయత్నం చేస్తున్నారు. దాని చుట్టూ కెమెరాలు ఉన్నాయని, దాని లోపల ఎవరైనా ఉన్నారేమో అని అనుమానిస్తున్న స్థానికులు కొందరు, డోరు తీస్తే తాము కాపాడమంటూ శకటం వద్దకు వెళ్లి చెబుతున్నారు. మొత్తానికి అధికారులు వచ్చి అదేంటో చెప్పి, అది ఎందుకు అక్కడ పడిందో చెబితే గానీ స్థానికులకు ఆందోళన తగ్గేలా లేదు. ఇక కొందరు ఈ శకటాన్ని వీడియో తీసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

హైదరాబాద్ లోనూ ఆకాశంలో వింత... శాస్త్రవేత్తలుఏం చెప్పారంటే

కాగా ఈరోజు ఉదయం హైదరాబాద్ వాసులు ఆకాశంలో ఒక వింత ఆకారాన్ని చూసి హడావిడి చేశారు. ఆకాశంలో గ్రహం మాదిరిగా ఉన్న ఒక ఆకారాన్ని చూసిన హైదరాబాద్ వాసులు తమ సెల్ ఫోన్ కెమెరా లో వీడియో తీశారు. అది గ్రహమా లేక నక్షత్రమా లేదా ఏలియన్ షిప్ ఏమైనా భూమికి సమీపించిందా అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో కొందరు మార్స్ గ్రహం భూమికి సమీపించింది అని చెబితే, కొందరు అది నక్షత్రమని, ఇంకొందరు ఏలియన్ అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే శాస్త్రవేత్తలు అది వెదర్ రిసెర్చ్ బెలూన్ గా తేల్చారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించిన బెలూన్ అని చెప్పారు. ఇక దీని పై వస్తున్న ఊహాగానాలను వారు కొట్టిపారేశారు.

కూతురా.. రాక్షసా.. కాళ్ళ కడియాలు, పించన్ డబ్బుల కోసం తల్లిపై కూతురి కర్కశత్వం!!కూతురా.. రాక్షసా.. కాళ్ళ కడియాలు, పించన్ డబ్బుల కోసం తల్లిపై కూతురి కర్కశత్వం!!

English summary
In Vikarabad district, there was a strange object in the fields. A strange object was seen in the sky in Hyderabad as well. As a result, there is a massive campaign on social media as it was an alien ship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X