ఏపీ-తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిక్స్ : గ్రూపులకు అతీతంగా - ఏకపక్షంగా..!!

గ్రూపు రాజకీయాలు..ఆధిపత్య పోరుతో సతమతం అయ్యే తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ లో ఇప్పుడు వీటికి భిన్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ అధ్యక్ష వేళ..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏకాభిప్రాయం వినిపిస్తోంది. నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. 137 సంవత్సాల కాంగ్రెస్ చరిత్రలో ఆరోసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందునా గాంధీ కుటుంబం కాని వారు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకొనే పీసీసీ డెలిగేట్లకు క్యూ ఆర్ కోడ్ తో కార్డులు అందాయి. తెలంగాణ లో పార్టీ ప్రధాన కార్యాలయంలో గాంధీ భవన్ లో పోలింగ్ జరగనుంది.

All arrangements have been made for members to vote in the Congresss presidential poll in Telugu States

రేవంత్ టీం మొత్తం ఏకపక్షంగా
ప్రదేశ్‌ రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు రాజమోహన్‌ ఉన్నితన్‌, రాజ్‌ భఘేల్‌ పర్యవేక్షణలో పోలింగ్‌ ప్రక్రియ సాగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా టీపీసీసీ ఎలక్టెడ్‌ సభ్యులు 238 మంది ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గే - శశి థరూర్ పోటీ పడుతున్నారు. తెలంగాణ - ఏపీ కాంగ్రెస్ నేతలకు ఖర్గేతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఖర్గేకు గాంధీభవన్‌లో ఘన స్వాగతం లభించింది.

All arrangements have been made for members to vote in the Congresss presidential poll in Telugu States

కర్నూలు కేంద్రంగా ఏపీ కాంగ్రెస్
అయితే, ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన శశిథరూర్‌ ఇక్కడి ముఖ్య నాయకులను కలిసేందుకు ప్రయత్నించగా స్థానిక కాంగ్రెస్ నేతలు ముందుకు రాలేదు. ఖర్గేకు పోలింగ్‌ ఏజెంట్లుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ మల్లు రవి వ్యవహరిస్తున్నారు. తనకు పోలింగ్‌ ఏజెంట్లుగా కాంగ్రెస్‌ సభ్యులు ఓ ఇద్దరిని థరూర్‌ నియమించుకున్నట్లు తెలిసింది. సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు బాహాటంగానే ఖర్గేకు మద్దతు ప్రకటించారు. ఇక, ఏపీలోనూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీ లో కాంగ్రెస్ డెలిగేట్లు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది పీసీసీ డెలిగేట్లు ఉన్నారు.

All arrangements have been made for members to vote in the Congresss presidential poll in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో సర్వం సిద్దం
వారంతా కర్నూలుకు తరలి రానున్నారు. 22 ఏళ్ల తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కర్నూలు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ రోజు పర్యటించనున్నారు. ఇక, ఈ నెల 18వ తేదీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్నూలు జిల్లాలో జరిగే భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆయన యాత్ర కొనసాగనుంది. అయితే, ఏపీ -తెలంగాణలో ఖర్గేకు అనుకూలంగానే ఏకపక్షంగా ఓటింగ్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+