తెలంగాణలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో రైతులకు ప్రకటించిన రూ. లక్ష రుణమాఫీ పథకాన్ని అర్హులైన రైతులందరికీ అమలు చేస్తుందని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు వెల్లడించారు. రైతుబంధు నిధులను వారి రుణ ఖాతాల్లో జమ చేయొద్దని ఇప్పటికే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చామని తెలిపారు.

రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపిన ఆయన ఈ మేరకు వెల్లడించారు. ఇప్పటి వరకు 5,42,635 మంది రైతులకు చెందిన రూ. 1207 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. మిగిలినవారి వారి కోసం 2023-24 బడ్జెట్‌లో రూ. 6325 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

 All eligible farmers will get Rs. One lakh loan waiver

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) ప్రకారమే అన్ని బ్యాంకులు రైతుల ఖాతాలను రెన్యూవల్ చేస్తూ రుణాల పంపిణీని కొనసాగించాలని సూచించామని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. రైతులకు సకాలంలో రుణాలను మంజూరు చేసి అండగా ఉండాలని నిర్దేశించినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. కడెం ప్రాజెక్టుపై లక్ష్మీపూర్ ఎత్తిపోతల సహా రాష్ట్రానికి చెందిన రహదార్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ప్రతిపాదనలకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించిన 23 అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి ఆమోదం లభించింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మిద్దామనుకున్న.. లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకానికి వైల్డ్ లైఫ్ బోర్డ్ అనుమతులు ప్రకటించింది.

సాగునీటి శాఖ ప్రతిపాదనలను పరిశీలించి అటవీశాఖ నిబంధనల మేరకు అనుమతులు జారీ చేసింది. ఎత్తిపోతల కోసం 3.17 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు బోర్డు అంగీకరించిందని.. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీసీసీఎఫ్ ఆర్​ఎం డోబ్రియాల్ పేర్కొన్నారు. దీంతో పాటు తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో రహదార్ల నిర్మాణం, వాటి వెడల్పునకు సంబంధించిన 11 ప్రతిపాదనలు.. ఐదు పంచాయతీరాజ్ రోడ్లకు, కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ డివిజన్​లో విద్యుత్ లైన్ ప్రతిపాదనకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+