నేటి నుంచి హైదరాబాద్‌లో ఆల్ ఇండియా హార్టికల్చర్ మేళా...
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నేటి నుంచి నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఆల్ ఇండియా హార్టికల్చర్ మేళా కార్యక్రమం జరగబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా మేళా ఇన్‌చార్జి ఖలీద్ అహ్మద్ పేర్కొన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉత్పత్తులతో 16వ ఆలిండియా హార్టికల్చర్ మేళాను ప్రారంభించనున్నట్టు మేళా ఇన్‌చార్జి వివరించారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నేటి (గురువారం) నుంచి సెప్టెంబర్ 2 వరకు ఐదురోజులపాటు ఈ మేళా ఉంటుందని ఆయన తెలిపారు. ఇక, ఈ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఈ మేళా ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పర్యాటకులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ మేరకు మేళా ఇన్‌ఛార్జీ బుధవారం ప్రత్యేక బ్రౌచర్‌ను కూడా ఆవిష్కరించారు. టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి నూతను పద్ధతులను ఈ మేళాలో ప్రదర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఏపీ, కోల్‌కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, పుణె, షిర్డీ, కడియం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్‌తో 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని ఇన్‌ఛార్జీ వివరించారు. వివిధ రకాల మొక్కలు ఈ స్టాల్స్‌లో ఏర్పాటు చేస్తారు. అరుదైన జాతుల పువ్వులు.. రకరకాల మొక్కలు ఈమేళాలో పర్యాటకులను ఆహ్లాదపరచున్నాయి. ఈ మేళాలో ఇంకా వివిధ రకాల పూల మొక్కలు, పండ్ల జాతులు, విత్తనాలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ సైన్స్, మొక్కల పెంపకానికి ఉపయోగపడే పరికరాలు, వస్తువులు మరెన్నో ఉంటాయి.












Click it and Unblock the Notifications