CWC Meeting: అతిధుల కోసం 126 రకాల వంటకాలు - తెలంగాణ ఘుమఘుమలు..!!

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు హైదరాబాద్ సిద్ధమైంది. సమావేశానికి హాజరవుతున్న కాంగ్రెస్ అధినాయకత్వానికి అదిరిపోయే ఆదిత్యం ఇచ్చేందుకు టీపీసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సి డబ్ల్యూ సి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అతిథుల కోసం దాదాపు 126 రకాల వంటకాలతో పసందైన వంటకాలను సిద్ధం చేశారు.

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నడుమ హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్ర నాయకులందరూ పాల్గొంటున్నారు. సోనియా రాహుల్ ప్రియాంక, ఖర్గేతో పాటు ముఖ్య నేతలు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. అతిధులకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. కర్ణాటకలో గెలుపు తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ హై కమాండ్ ఇక్కడి నుంచే 2024 ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమైంది. ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇతర భాగస్వామి పక్షాలను కలుపుకుపోవడం, అదేవిధంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దదించడమే లక్ష్యంగా ఈ సమావేశంలో కార్యాచరణ ఖరారు చేస్తారని తెలుస్తుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా 29 రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు హైదరాబాద్ చేరుకున్నారు.

All set for CWC meeting in Hyderabad, 126 varieties of Telangana Food items to be served for Delgates

సిడబ్ల్యుసి సమావేశానికి వచ్చే అతిధుల కోసం పిసిసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపు 126 రకాల వంటకాలను ఏర్పాటు చేసింది. అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన వంటలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్ని రకాల వంటలు రుచులు ఉండేలా మెనూ సిద్ధం చేసింది. ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా చెఫ్ లను రప్పించింది. అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ ,పెసరట్టు, ఉగ్గాని, కిచిడి, ఉప్మా, రాగి, జొన్న, సంగటి, పాయ సూప్, కీమా, రోటి, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ వడ, ఫ్రూట్ సలాడ్ వంటివి సిద్ధం చేశారు.

మధ్యాహ్నం భోజనంలో హైదరాబాది థమ్ బిర్యాని, హలీం, బగారా రైస్, కూర్మా దాల్చా, మటన్, స్పెషల్ చికెన్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, తలకాయ కూర, లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, చాపలు ప్రత్యేకంగా తయారు చేయించారు. శాఖాహారుల కోసం పచ్చిపులుసు, గోంగూర చట్నీ. గుత్తి వంకాయ, కొబ్బరి చెట్ని, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్ళు మెనూలో చేర్చారు. స్నాక్స్ ఐటమ్స్ గా ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కెట్లు సర్వపిండి పలు రకాల సమోసాలు మురుకులు, ఉడికించిన మొక్కజొన్న సకినాలు గారెలు రుచి చూపించేందుకు సిద్ధమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+