నేటి పోలింగ్ కు సర్వం సిద్దం : తెలంగాణ భవన్‌ టు అసెంబ్లీ : సిన్హాకు మద్దతుగా..!!

రాష్ట్రపతి ఎన్నికల కోసం తెలంగాణ శాసనసభలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలతో పాటుగా ఏపీకి చెందిన ఒక శాసనసభ్యుడు సైతం హైదరాబాద్ లోని అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించునున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారులతో పాటుగా అసెంబ్లీ స్పీకర్.. కార్యదర్శి సైతం పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు సహా రాష్ట్రానికి చెందిన మంది శాసనసభ్యులు అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. రాస్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఇతర ఎన్నికల కంటే భిన్నంగా జరుగుతుంది.

టీఆర్ఎస్ కార్యాలయంలో మాక్ పోలింగ్

టీఆర్ఎస్ కార్యాలయంలో మాక్ పోలింగ్

పోటీలో ఉన్న అభ్యర్ధులకు మద్దతుగా వారి పేరు ఎదుట 1 అంకె వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఇచ్చిన పెన్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వేరే పెన్ ఉపయోగిస్తే లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. దీంతో..పోలింగ్ ప్రారంభానికి ముందే మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ పత్రంలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము పేరు మొదట, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేరు తర్వాత ఉన్నాయి. ఏపీకి చెందిన కందుకూరు శాసనసభ్యుడు మహీధర్ రెడ్డి కూడా ఓటింగ్ కోసం హైదరాబాద్ ఐచ్ఛికంగా ఇచ్చారు. ఆయన కూడా తెలంగాణ అసెంబ్లీలోనే తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారి కృష్ణకుమార్ ద్వివేదిని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకునిగా నియమించింది.

అభ్యర్ధులిద్దరికీ ఓట్లు పడే ఛాన్స్

అభ్యర్ధులిద్దరికీ ఓట్లు పడే ఛాన్స్


శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఉపేందర్ రెడ్డి, ప్రసన్నకుమారితో కలిసి ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో శాసనసభ్యుల ఓటు విలువ 132గా ఖరారు చేసారు. మొత్తం 119 మంది సభ్యుల ఓట్ల విలువ 15,708 గా లెక్కించారు. ఇక, ఇద్దరు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడుతుండగా.. తెలంగాణ అధికార టీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించాయి. దీంతో..తెలంగాణలో సిన్హాకు అనుకూలంగా ఎక్కవ శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. బీజేపీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. వీరు ముర్ము వైపు నిలిచే అవకాశం ఉంది. టీఆర్ఎస్ కు చెందిన శాసనసభ్యులు ఉదయం తెలంగాణ భవన్‌లో మాక్‌ పోలింగ్‌లో పాల్గొని ఆ తర్వాత.. అక్కడి నుంచి బస్సుల్లో అసెంబ్లీకి వచ్చి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

ఎజెంట్లు ఖరారు.. బస్సులో అసెంబ్లీకి

ఎజెంట్లు ఖరారు.. బస్సులో అసెంబ్లీకి


తెరాస తరపున ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, హన్మంత్ షిండే ఏజెంట్లుగా వ్యవహరించనున్నారు. కాంగ్రెస్ సభ్యులు ఉదయం 9 గంటలకు శాసనసభ చేరుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏజెంజ్‌గా ఉండనున్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు భాజపా ఏజెంట్‌గా వ్యవహరించనున్నారు. పోలింగ్ నేపథ్యంలో శాసనసభ పరిసరాలు, ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శాసనసభ్యులను మినహా మిగతా ఎవరినీ భవనం లోపలికి అనుమతించడం లేదు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సును స్టోర్ రూంలో భద్రపరుస్తారు. రేపు ఉదయం బ్యాలెట్ బాక్సును దిల్లీ తీసుకువెళ్తారు. మొత్తం తెలంగాణకు చెందిన 119 మంది ఏపీకి చెందిన ఒక ఎమ్మెల్యేతో కలిపి 120 ఓట్లు తెలంగాణ అసెంబ్లీలో పోల్ కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+