తెలంగాణలో నేడే పాలీసెట్ ఎగ్జామ్.. ఒక్క నిమిషం లేటైనా అంతే !
తెలంగాణలో నేడే పాలీసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 3సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమాలల్లో అడ్మిషన్స్ భర్తీ చేయనున్నారు.
పరీక్ష ఈరోజు ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 276 పరీక్ష కేంద్రాలను సిద్దం చేయగా.. 1,06,716 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని అధికారులు తెలిపారు.

HB బ్లాక్ పెన్సిల్, ఎరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ పరీక్షకు తీసుకురావాల్సి ఉంటుంది. హాల్ టికెట్‌పై ఫోటో లేకపోతే, విద్యార్థులు తప్పనిసరిగా ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఐడీ ప్రూఫ్ తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు. అలానే సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రం లోకి అనుమతించబడవు.
విధ్యార్థులకు కీలక సూచనలు..
పరీక్షకు ఒక గంట ముందు, అంటే ఉదయం 10:00 గంటలకే పరీక్ష కేంద్రం వద్ద ఉండాలి.
ఉదయం 11:00 తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి లేదు.
పరీక్ష కేంద్రం ఎలా చేరుకోవాలి..?
విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాన్ని సులభంగా గుర్తించేందుకు SBTET TG యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులోని POLYCET Exam Center Locator టాబ్ ఓపెన్ చేసి, మీ వివరాలు ఎంటర్ చేస్తే మీ సెంటర్‌కు వెళ్లే దారి మాపింగ్‌తో సహా చూపిస్తుంది.












Click it and Unblock the Notifications