అల్లు అర్జున్ కేసు.. ఊహించని విధంగా ఇరుక్కున్న రష్మిక మందన్నా!
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇష్యూ రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి మాట్లాడడం వెనుక కూడా అల్లు అర్జున్ కేసు ఉందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
అల్లు అర్జున్ టార్గెట్ గా పెద్ద ఎత్తున చర్చ
టికెట్ల రేట్లు పెంచడంలో బెనిఫిట్ షోల విషయంలో మాత్రం నిర్ణయం మార్చుకోనని చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి సంబంధించి మిగతా అన్ని విషయాలకు తాను సహకారాన్ని అందిస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కు సంబంధించి నమోదైన కేసులో అల్లు అర్జున్ టార్గెట్ గా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

అభాసుపాలైన అల్లు అర్జున్
ఇప్పటికే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరు పరిచి, కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడా జైలుకు తరలించగా, మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చి ఈ కేసును ఎదుర్కోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఇక ఈ కేసు వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలతో అల్లు అర్జున్ ప్రతిష్ట అభాసుపాలైంది.
అల్లు అర్జున్ తో పాటు రష్మిక... కేసు నమోదుకు డిమాండ్
ఆత్మ రక్షణలో పడిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మరింత తప్పయింది. ఇక ఈ కేసుల నుంచి బయటకు రావడానికి నానా విధాలుగా కొట్టుమిట్టాడుతున్నాడు అల్లు అర్జున్. ఇక ఇదే సమయంలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్న కూడా వెళ్లారు. అయితే రష్మిక మందన్న పైన కూడా కేసు నమోదు చేయాలని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు.
బాధిత కుటుంబానికి రష్మిక సహాయం చెయ్యరా?
ఎందుకు రష్మిక మందన్నాను వదిలేశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమెను కూడా అరెస్టు చేసే జైల్లో పెట్టాలని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి కోటి రూపాయలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు ఇస్తున్నప్పుడు, ఈ ఘటనకు బాధ్యురాలైన రష్మిక మందన్న ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు.
ఊహించని విధంగా ఇరుక్కున్న రష్మిక
ఇక తనకేమీ సంబంధం లేనట్టు విజయ్ దేవరకొండ తో షికార్లు చేస్తుందని కొంతమంది నెటిజన్లు రష్మికను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఊహించని విధంగా రష్మిక మందన్నాను సోషల్ మీడియా ద్వారా ఇరికిస్తున్నారు. మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఇది రష్మికకు పెద్ద తలనొప్పిగా మారింది.












Click it and Unblock the Notifications