తూచ్ ..నేనెళ్లట్లెదు .. పార్టీ మార్పుపై చేవెళ్ల చెల్లెమ్మ
Recommended Video

హైదరాబాద్ : పార్టీ మార్పుపై గత కొద్దిరోజులుగా జరుగుతోన్న ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేశారు చేవెళ్ల చెల్లెమ్మ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సబిత పార్టీ మారబోనని స్పష్టంచేసినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది.

రంగంలోకి రేవంత్ ..
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ప్రలోభాల పర్వం ఊపందుకొంది. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియ, టీడీపీకి చెందిన సండ్ర వెంకట వీరయ్య కారెక్కారు. వీరితోపాటు సబితా ఇంద్రారెడ్డి పేరు కూడా వినిపించింది. సబితకు మంత్రి పదవీ, ఆమె కుమారుడు కార్తీక్ కు టీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల కేటీఆర్ తో సమావేశం .. ప్రచారానికి బలం చేకూర్చింది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడి .. పార్టీ మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సూచించారు.

రాహుల్ వద్దకు రేవంత్, సబిత
తాను రంగంలోకి దిగి హామీ ఇవ్వడం గాక పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చెప్పిస్తే బాగుంటుందని అనుకున్నారు రేవంత్. అందుకే ఇవాళ సాయంత్రం రాహుల్ వద్దకు తీసుకెళతానని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీలో ఇబ్బందులు, సీట్ల కేటాయింపు తదితర అంశాలపై సబితకు హామీ వచ్చే అవకాశం ఉంది. అలాగే తాను కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశాలు లేవని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.

వలసలకు బ్రేక్ పడినట్టేనా ?
పార్టీ మార్పుపై సబితా ఇంద్రారెడ్డి వెనక్కి తగ్గడంతో ఇతర నేతల వలసలకు బ్రేక్ పడనట్టేనా అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి టీఆర్ఎస్ లో మరో ఇద్దరు, ముగ్గురు నేతలు చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే కీలక నేత సబితా ఇంద్రారెడ్డి .. తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో ... మిగతా నేతలు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications