వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో 9,500కోట్ల అమరరాజా పెట్టుబడి; మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో అమర రాజా బ్యాటరీస్ పెట్టుబడులకు మంత్రి కేటీఆర్ రెడ్ కార్పెట్ వేసిన విషయం తెలిసిందే. తెలంగాణాలో అమరరాజా పెట్టుబడులు పెట్టడం పై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అమర రాజా గ్రూప్ కి చెందిన అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ లిథియం ఇయాన్ గిగా ఫ్యాక్టరీ కోసం తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకొని నేడు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, అమర రాజా సంస్థ చైర్మన్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీ ఫైబర్ యండి సీఈవో సుజయ్ తదితరులు పాల్గొన్నారు.

అమరరాజా గ్రూప్ తో నేడు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న క్రమంలో దీనిపై మాట్లాడిన మంత్రి కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన అమర రాజా సంస్థకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మరో భారీ పెట్టుబడి ఇది అని ఆయన పేర్కొన్నారు. అమర రాజా సంస్థ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని పేర్కొన్నారు.

 Amararaja investment Rs.9,500 crore in Telangana; Minister KTR said its a huge investment!!

37 సంవత్సరాలుగా అమరరాజా సేవలందిస్తోంది అని పేర్కొన్న కేటీఆర్, సుమారు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు రావటానికి అన్ని వసతులు కల్పిస్తున్నామని, తెలంగాణలో మానవ వనరులు కూడా సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమర రాజా బ్యాటరీస్ ను విస్తరించాలని భావించిన గల్లా జయదేవ్, తమ సంస్థ కార్యకలాపాలను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని చాలామంది యువతకు ఉపాధి కల్పిస్తుంది అన్న భావన తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వ్యక్తం చేశారు.

 Amararaja investment Rs.9,500 crore in Telangana; Minister KTR said its a huge investment!!
English summary
Amararaja signed an MOU with the Telangana government today. Stating that Amararaja will invest 9,500 crores in Telangana, Minister KTR stated that this is a huge investment in Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X