అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్మార్ట్ సిటీ జాబితాలో అమరావతి, కరీంనగర్: వెంకయ్య నాయుడు, 30 సిటీలు ఇవే..

నవ్యాంధ్ర రాజధాని అమరావతి, తెలంగాణలోని కరీంనగర్‌లకు స్మార్ట్ సిటీలో చోటు కల్పించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతి, తెలంగాణలోని కరీంనగర్‌లకు స్మార్ట్ సిటీలో చోటు కల్పిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు వెల్లడించారు.

కొత్తగా మరో 30 నగరాలను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి రెండు నగరాలకు చోటు దక్కింది.

Amaravati and Karimnagar in smart cities list: Venkaiah Naidu

ఇటీవలే వెంకయ్యను తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కలిశారు. సోమవారం కేంద్రమంత్రిని కలిసిన కేటీఆర్.. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, తమిళనాడు నుంచి 4, కేరళ 1, యూపీ 3, కర్ణాటక 1, గుజరాత్‌ 3, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 2 నగరాలు ఎంపికయ్యాయి. దీంతో ఇప్పటివరకూ 90 నగరాలు స్మార్ట్‌సిటీ మిషన్‌ కిందకు చేరాయి.

తిరువనంతపురం, నయా రాయ్‌పూర్‌, రాజ్‌కోట్‌, అమరావతి, పట్నా, కరీంనగర్‌, ముజఫర్‌నగర్‌, పుదుచ్చేరీ, గాంధీనగర్‌, శ్రీనగర్‌, సాగర్‌, కర్నల్‌, సత్నా, బెంగళూరు,సిమ్లా, డెహ్రాడూన్‌, తిరుప్పూర్‌,పింప్రీ చించ్వద్‌, బిలాస్‌పూర్‌, పాశిఘాట్‌, జమ్ము, దాహోద్‌, తిరునెల్వేలి, తూతుకుడి, తిరుచురాపల్లి, ఝాన్సీ, ఐజల్‌, అలహాబాద్‌, అలిగఢ్‌, గ్యాంగ్‌టక్‌‌లను స్మార్ట్ జాబితాలో చేర్చారు.

English summary
Union Minister Venkaiah Naidu on Friday said that Centre is including Amaravati and Karimnagar in smart cities list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X