అమరావతి రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి, కాచిగూడ టెర్మినల్స్
దేశంలోనే అతి పెద్ద రైల్వేస్టేషన్ గా నిర్మాణం జరుపుకోబోతున్న అమరావతి రైల్వేస్టేషన్ లో నాలుగు టెర్మినల్స్ నిర్మిచబోతున్నారు. ప్రస్తుతం మనకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, చర్లపల్లి ఎలా అయితే టెర్మినల్స్ గా ఉన్నాయో అలాగే అవి కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక టెర్మినల్ నుంచి మరో టెర్మినల్ కు చేరుకోవాలంటే అత్యంత ప్రయాసతో కూడుకొని ఉంటోంది. చర్లపల్లి అయితే ఇంకా దారుణంగా ఉంటోంది. ప్రత్యేక రైళ్లన్నీ ఇక్కడి నుంచే బయలుదేరుతుండటంతో ప్రయాణికులకు చర్లపల్లి చేరుకోవాలంటే చుక్కలు కనపడుతున్నాయని చెప్పొచ్చు.
నాలుగు దిక్కులకు నాలుగు టెర్మినల్స్
అమరావతి రైల్వేస్టేషన్ లో అలా కాకుండా నాలుగు టెర్మినల్స్ పక్కపక్కనే ఉంటాయి. అక్కడి నుంచి దేశంలోని అన్నివైపులకు వెళ్లేందుకు రైళ్ల సౌకర్యం ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలకు ఒక టెర్మినల్, దక్షిణాది రాష్ట్రాలకు ఒక టెర్మినల్, రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక టెర్మినల్, ఈశాన్య రాష్ట్రాలకు ఒక టెర్మినల్ ఉంటుంది. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ముందుగానే ఇలా నిర్మాణం చేస్తున్నారు. అంతేకాకుండా రోజుకు 3 లక్షల మంది రాకపోకలు సాగించే సామర్థ్యంతో, 24 ప్లాట్ ఫామ్స్ తో సిద్ధం కానుంది. దీనికోసం 2500 కోట్ల రూపాయల వ్యయం కానుంది.

ప్రస్తుతం హౌరాలో 23 ప్లాట్ ఫాంలున్నాయి
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని హౌరా 23 ప్లాట్ ఫామ్స్ తో అతి పెద్ద రైల్వేస్టేషన్ గా ఉంది. అమరావతి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇదే అతి పెద్ద స్టేషన్ అవుతుంది. అలాగే దేశంలోనే అతి పొడవైన రైల్వే వంతెన కూడా రాబోతోంది. 3.2 కిలోమీటర్ల పొడవునా కృష్ణా నదిపై వంతెన రాబోతోంది. విమానాశ్రయం తరహాలో ఉండే ఈ రైల్వేస్టేషన్ కు సమీపంలోనే అతి పెద్ద గూడ్స్ యార్డును ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ఒక ప్లాట్ ఫాం నుంచి మరో ప్లాట్ ఫాంకు చేరుకునేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులతోపాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు.












Click it and Unblock the Notifications