వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ సర్కార్ మరో సంచలనం - రిజిస్ట్రేషన్లు బంద్, ఆ శాఖకు సెలవులు - పున:ప్రారంభంపై నో క్లారిటీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ వ్యాప్తంగా అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. లాక్ డౌన్ దెబ్బకు కుదేలై.. ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్నాయనగా.. కేసీఆర్ సర్కారు తాజా సంచలన నిర్ణయం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ల నిలుపుదల ఒక్కరోజుకేనా? లేక కొత్త రెవెన్యూ చట్టం వచ్చేదాకానా? అనేది వెల్లడికాలేదు. అయితే రిజిస్ట్రేషన్ల శాఖకు నిరవధిక సెలవులు ప్రకటించిన దరిమిలా కొత్త చట్టం తర్వాతే రిజిస్ట్రేషన్లు పున:ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. ఇంకొద్ది గంటల్లో జరుగనున్న కేబినెట్ మీటింగ్ లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

మావోయిస్టు గణపతి లొంగుబాటుకు పోలీసుల సహకారం - కేసీఆర్ దగ్గరి వ్యక్తుల ద్వారా మంతనాలు?మావోయిస్టు గణపతి లొంగుబాటుకు పోలీసుల సహకారం - కేసీఆర్ దగ్గరి వ్యక్తుల ద్వారా మంతనాలు?

 ఆ రెండూ నిలుపుదల..

ఆ రెండూ నిలుపుదల..

రిజిస్ట్రేషన్లనేకాదు, స్టాంపుల విక్రయాలను కూడా అధికారులు నిలిపేశారు. అయితే, ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి సోమవారం ఒక్కరోజు మాత్రమే అవకాశం కల్పించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే ఉద్దేశంతో.. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలంటూ కేసీఆర్ సర్కారు సంచలన ఆదేశాలు జారీ చేసిన దరిమిలా ఆ ప్రభావం రిజిస్ట్రేషన్లపై పడింది.

ఆ శాఖకు సెలవులు..

ఆ శాఖకు సెలవులు..


తెలంగాణలోని రిజిస్ట్రేషన్ల శాఖ‌కు ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం నుంచి సెల‌వులు వ‌ర్తిస్తాయ‌ంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచి స్టాంపుల ‌విక్ర‌యాలు పూర్తిగా నిలిపివేశామ‌ని, ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం నుంచి పూర్తిగా రిజిస్ర్టేష‌న్లు ఆగిపోతాయ‌ని, కొత్త రెవెన్యూ చ‌ట్టం దృష్ట్యా ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో రిజిస్ర్టేష‌న్లు నిలిపివేశామ‌ని రిజిస్ర్టేష‌న్లు, స్టాంపుల శాఖ క‌మిష‌న‌ర్ చిరంజీవులు తెలిపారు. కాగా, త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు సెల‌వులు ఉంటాయని ఉత్తర్వులు పేర్కొన్నారు.

 రిజిస్ట్రేషన్లు మళ్లీ ఎప్పుడు?

రిజిస్ట్రేషన్లు మళ్లీ ఎప్పుడు?

వీఆర్వోల నుంచి మధ్యాహ్నం 3లోగా రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని, సాయంత్రం 5 గంటల వరకు రిపోర్టు పంపాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్లను నిలిచిపోయాయి. కేసీఆర్ సర్కారు ప్రతిపాదించిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇకపై రిజిస్ట్రేషన్లన్నీ తహశీల్దార్ల పరిధిలోనే జరుగుతాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించాలని సీఎం భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం జరుగనున్న కేబినెట్ భేటీలో బిల్లుకు ఆమోదం తెలిపి, మంగళవారమే సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

English summary
as Telangana government has decided to scrap the Village Revenue Officer (VRO) system, registrations across the state have been stalled on monday. all vro need to submit records to concern district collectors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X