బండి సంజయ్‌కి అమిత్ షా, జేపీ నడ్డా అభినందనలు: తెలంగాణ ప్రజల కోరిక అదే

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని అందించింది.

హైదరాబాద్: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డికి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.

అవినీతితో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు.. మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారనేందుకు ఈ విజయమే నిదర్శనమని అమిత్ షా అన్నారు. బండి సంజయ్ తోపాటు పార్టీ నాయకత్వాన్ని బీజేపీ శ్రేణులకు కూడా అభినందనలు తెలిపారు అమిత్ షా, జేపీ నడ్డా.

Amit Shah and JP nadda congratulates AVN Reddy, who is winning in MLC elections and bandi sanjay

కాగా, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చి.. స్వీట్లు పంచుకున్నారు. ఈ సంబరాల్లో బండి సంజయ్, డీకే అరుణ, ఏవీఎన్ రెడ్డితోపాటు పలువురు నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏవీఎన్ రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు బండి సంజయ్. అప్రజాస్వామిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్లు ఇచ్చిన తీర్పు ఇదని చెప్పారు. బీజేపీ విజయంలో భాగమైన ఉపాధ్యాయులకు బండి సంజయ్ అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+