త్వరలో బీజేపీ భారీ బహిరంగ సభ ..ఒకే వేదికపై అమిత్‌షా, పవన్ కళ్యాణ్ .. కారణమిదే
త్వరలో బీజేపీలో కీలక నేత అమిత్ షా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద మాట్లాడబోతున్నారు. బీజేపీ, జనసేనల మధ్య ఉన్న బంధాన్ని తెలియజెయ్యటంతో పాటు వారిరువురూ ఒకే అంశంపై తమ ఉమ్మడి అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యనున్నారు . తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో అమిత్ షా , పవన్ లు ఇద్దరూ పాల్గొననున్నారు. అందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తుంది బీజేపీ .

మార్చి 14వతేదీన ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగ సభ
కేంద్ర సర్కార్ లో బీజేపీలో కీలక నేతగా భావిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్చి నెల 14వతేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఒకే వేదిక మీద కనిపించనున్నారు. ఇప్పటి వరకు బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఇంత కాలం అయినా కలిసి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. ఇక తాజాగా ఏపీ రాజధాని విషయంలో కేంద్రం నిర్ణయం , వైసీపీ బీజేపీకి సన్నిహితంగా మెలగటం జనసేనకు తలనొప్పిగా మారాయి. ఆదిలోనే మైత్రీ బంధానికి చెక్ పెడుతుంది అని ప్రచారం జోరుగా సాగింది.

బీజేపీ , జనసేన పొత్తుపై అనుమానాలు .. సభతో సమాధానం చెప్పనున్న పార్టీలు
ఇక తమ బంధం బలంగా ఉందని త్వరలోనే ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తామని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పినా సరే ప్రజల్లో వీరి పొత్తుపై అనుమానాలు అలాగే ఉన్నాయి. ఇక ఇదే సమయంలో తెలంగాణా రాష్ట్రంలో సీఏఏ పై అవగాహన కల్పించటం కోసం బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఒకే వేదిక మీద అమిత్ షా మరియు పవన్ సీఏఏ , ఎన్నార్సీలపై రెండు పార్టీల ఉమ్మడి అభిప్రాయాన్ని వెల్లడించబోతున్నారు. ఇందుకోసం బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు .

సీఏఏ అవగాహనకు బీజేపీ భారీ బహిరంగ సభ
భారతీయ పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణా సర్కార్ సైతం సీఏఏ ను వ్యతిరేకిస్తూ క్యాబినెట్ లో తీర్మానం చేసింది. ఇక బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు అనుకూలంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ మోదీ ప్రభుత్వ ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నారు. మతపరమైన ఎలాంటి అంశాలకు దీనిలో తావు లేదని చెప్తున్నారు.
Recommended Video


సభలో మాట్లాడనున్న అమిత్ షా , పవన్ కళ్యాణ్ లు
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు.. హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక దీని కోసం ఎల్బీ స్టేడియంలో మార్చి నెల 14వతేదీన బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుని ఈ సభకు ముఖ్య అతిథిగా అమిత్‌షా ను , మిత్ర పక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరో విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. ఇప్పటికే పవన్ కూడా సీఏఏ కు మద్దతు తెలుపగా తెలంగాణ నేతల కార్యచరణ ముందుకు రావడంతో సభకు వస్తానని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో అమిత్ షా , పవన్ లు ఒకే వేదిక మీద కనిపించనున్నారు .
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications