హైదరాబాద్‌కు అమిత్ షా: పీవీ సింధుతో భేటీ, బీజేపీ నేతలతో చర్చలు

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. శనివరాం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ, విజయశాంతి, ధర్మపురి అరవింద్, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

ఎయిర్ పోర్ట్ నుంచి అమిత్ షా.. ప్రముఖ బ్యాండ్మిటన్​ క్రీడాకారిణి పీవీ సింధును కలిశారు. సంపర్క్​ సే సంవర్ధన్‌​లో భాగంగా సింధుతో సమావేశమయ్యారు. కాసేపు పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో సింధు తండ్రి పీవీ రమణ కూడా పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నారు.

Amit Shah reaches hyderabad: meets with PV Sindhu

అనంతరం జూబ్లీహిల్స్‌లోని సీఆర్ఫీఎఫ్ కార్యాలయంలో.. రాష్ట్రానికి చెందిన పార్టీ అగ్రనేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్​ పాల్గొన్నారు.

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు ఈ సందర్భంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశంపై అమిత్ షా ఆరా తీసినట్లు తెలిసింది. కాగా, ఆదివారం ఉదయం ఉదయం 9 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవంలో అమిత్ షా పాల్గొంటారు.

Amit Shah reaches hyderabad: meets with PV Sindhu

అనంతరం రేపు మధ్యాహ్నం తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల తదితర నాయకులతో.. అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమై అసెంబ్లీ ఎన్నికల సమాయత్తంపై సమాలోచనలు చేయనున్నట్లు సమాచారం.

ఇది ఇలావుండగా, సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో.. ఆదివారంనాటి అమిత్‌ షా సభ నేపథ్యంలో ఏర్పాట్లను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌పై ఆయన​ మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పాటించాలని కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదమన్నారు.

పరేడ్‌ మైదానంలో కేంద్ర అధికారిక కార్యక్రమాన్నిబీజేపీ సభగా హైదరాబాద్‌ పోలీసులు సర్కులర్‌ ఇవ్వడంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సర్క్యులర్‌ ఇవ్వడంపై క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించకుండా.. ఓట్ల రాజకీయాలు చేసి.. అమరుల త్యాగాలను మరుగునపరిచారని ధ్వజమెత్తారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుండగా.. హైదరాబాద్‌లో నిర్వహించకపోవడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కాగా, నిజాం పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17, 1948న స్వాతంత్ర్యం వచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+