గెలిచి తీరాల్సిందే... బీజేపీ ఆపరేషన్ తెలంగాణాపై అమిత్ షా చెప్పిందిదే!!
తెలంగాణా బిజెపి వచ్చే ఎన్నికలలో గెలిచి తీరాల్సిందేనని హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహం పై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. వచ్చే ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం పై ప్రధానంగా ఫోకస్ చేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం అందుకు తగినట్టుగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ప్రజలు బిజెపిని ఆదరించడం కోసం బిజెపి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఒకపక్క ప్రజా గోస.. బిజెపి భరోసా బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తూ, ఇంకోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ బీజేపీ ముందుకు సాగుతుంది.

తెలంగాణాలో దూకుడు పెంచిన బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న తరుణంలో, బిజెపి కాస్త దూకుడుగా ముందుకు వెళుతుంది. ఇప్పటికే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లతో ప్రజల మద్దతు కోసం ప్రజల వద్దకు వెళుతున్న బీజేపీ నాయకులు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అధిష్టానం ఆదేశాల మేరకు కీలకంగా పనిచేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీకి రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన బిజెపి అగ్రనేతలు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.

వచ్చే ఎన్నికల గురించి అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
ఉన్నఫళంగా బీజేపీ రాష్ట్రనేతలకు ఢిల్లీ నుండి పిలుపు రావటంతో ఏం జరుగుతుందో? అమిత్ షా ఏమి చెప్తారో అని అంతా టెన్షన్ పడ్డారు. ఒక దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తున్నారని కూడా ప్రచారం జోరుగా సాగింది. అందికాదు ముందస్తు ఎన్నికలు వస్తాయని అందుకే రమ్మని పిలిచినట్టు కూడా ప్రచారం జరిగింది. మొత్తంగా కీలక నాయకులందరూ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇక వచ్చే ఎన్నికల గురించి అమిత్ షా పార్టీ శ్రేణులకు కీలక విషయాలను వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచే తీరాలి: అమిత్ షా
తెలంగాణా బిజెపి వచ్చే ఎన్నికలలో గెలిచి తీరాల్సిందేనని హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో కలిసి వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహం పై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసిన అమిత్ షా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించాలని, మొత్తం 119 నియోజకవర్గాలలో సభలను నిర్వహించే ఆపై, ఉమ్మడి జిల్లాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని అమిత్ షా సూచించారు.

చేరికలపై దృష్టి పెట్టండి: అమిత్ షా
నాయకులంతా ఏకతాటి మీద ఉమ్మడిగా ముందుకు సాగాలని, ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఉద్బోధించారు. అలాగే చేరికల పై ప్రత్యేక దృష్టి సారించాలని అమిత్ షా రాష్ట్ర నేతలకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను తెలుసుకుని అందుకు అనుగుణంగా పని చెయ్యాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించి ముగింపు సభకు ప్రధాన నరేంద్ర మోడీని ఆహ్వానించాలన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు విజయవంతంగా నిర్వహించడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు.

ఆపరేషన్ తెలంగాణాలో ప్లాన్ తో విజయం సాధించండి
బిజెపి రాష్ట్ర నేతలకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు సక్సెస్ చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలో ఉండే చిన్న చిన్న మనస్పర్ధలను పక్కనపెట్టి నేతలంతా ముందుకు నడవకపోతే నష్టం జరుగుతుందని అమిత్ షా హెచ్చరించారు. ఆపరేషన్ తెలంగాణలో 90 నియోజకవర్గాలలో విజయం సాధించడానికి పక్కా ప్లాన్ తో ముందుకు సాగాలన్నారు.












Click it and Unblock the Notifications