తెలంగాణాలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారు.. టార్గెట్ ఫిక్స్!!
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబరు 17 తేదీని అన్ని రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఆరోజు జాతీయ సమైక్యత దినోత్సవం గా నిర్వహించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మరొకవైపు కాంగ్రెస్ కూడా సెప్టెంబర్ 17వ తేదీన బహిరంగ సభ నిర్వహించి తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సెప్టెంబరు 17 రసవత్తర రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి రానున్న అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలలో పాల్గొననున్నారు. ఈ మేరకు అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం లో పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షా ఒక్క రోజు ముందే హైదరాబాద్ కు రానున్నారు. సెప్టెంబర్ 16వ తేదీన రాత్రి 7 గంటల 55 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా సిఆర్పిఎఫ్ సెక్టార్స్ ఆఫీసర్స్ మెస్ కు చేరుకుని ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు.
మరుసటి రోజు ఉదయం సెప్టెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ కు చేరుకుని తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు.ఈ సందర్భంగా అమిత్ షా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా పర్యటన, సెప్టెంబర్ 17వ తేదీన చేయనున్న ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి ఏ విధంగా విమర్శలు చేస్తారనేది, ఏం చెప్పబోతున్నారు అనేది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అమిత్ షా తెలంగాణా నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు, అభ్యర్థులను ఖరారు చేయడం పైన కూడా అమిత్ షా రాష్ట్రనాయకులతో చర్చించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications